తెలంగాణ షూటర్‌కు మరో స్వర్ణం | Telangana shooter Dhanush Srikanth wins second gold at Deaflympics | Sakshi
Sakshi News home page

తెలంగాణ షూటర్‌కు మరో స్వర్ణం

Nov 18 2025 9:32 PM | Updated on Nov 18 2025 9:32 PM

Telangana shooter Dhanush Srikanth wins second gold at Deaflympics

టోక్యోలో జరుగుతున్న డెఫ్లింపిక్స్ 2025లో తెలంగాణకు చెందిన యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ మరోసారి స్వర్ణం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ సింగిల్స్‌ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డుతో పసిడి పతకం నిలబెట్టుకున్న ధనుష్‌.. తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లోనూ స్వర్ణ పతకం సాధించి డెఫ్లింపిక్స్ 2025లో రెండో గోల్డ్‌ను సొంతం చేసుకున్నాడు.

23 ఏళ్ల ధనుశ్‌ శ్రీకాంత్‌ 2022లో కాక్సియస్‌ డొ సుల్‌ (బ్రెజిల్‌)లో జరిగిన  డెఫ్లింపిక్స్‌లోనూ వ్యక్తిగత, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌ ఒలింపిక్‌ పతక విజేత గగన్‌ నారంగ్‌కు చెందిన ‘గన్‌ ఫర్‌ గ్లోరీ’ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

డెఫ్లింపిక్స్‌లో ధనుష్ సాధించిన విజయాలకు తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) శ్రీ ఏ. పి. జితేందర్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి అభినందనలు తెలిపారు. సింగిల్స్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకున్న అనంతరం ధనుష్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. శ్రీకాంత్‌కు రూ. 1 కోటి 20 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నట్లు వాకిటి శ్రీహరి వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement