సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 20 వరకు మొత్తం 9 రోజులు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
పేపర్–1, పేపర్–2 కలిపి మొత్తం 2,37,754 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 71,670 మంది ఇన్ సర్విస్ టీచర్లు ఉన్నారు. టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్‌కు దరఖాస్తు చేశారు. టెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 97 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.


