సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ ఐఐటీకి చెందిన ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే విద్యార్థి రూ.2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. సీఎస్‌ఈ ఫైనలియర్ చదువుతున్న వర్గీస్‌కు నెదర్లాండ్‌లోని అప్టివర్ అనే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఈ ఉద్యోగం లభించింది. ఐఐటీహెచ్ చరిత్రలోనే అత్యధిక వేతనంతో ఉద్యోగం పొందిన విద్యారి్థగా వర్గీస్ నిలిచాడు. గత డిసెంబర్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రక్రియ నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన 24 కంపెనీలు ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగాలిచ్చాయి. గతేడాదితో పోలి్చతే 2025లో ప్లేస్‌మెంట్ ఉద్యోగాలు 75 శాతం పెరిగాయి.


