రేగోడ్(మెదక్): హీటర్‌లో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని టి.లింగంపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పూలమ్మ ఇందిరా క్రాంతి పథకంలో వీఓగా పని చేస్తున్నారు. సోమవారం స్నానం చేసేందుకు నీళ్లలో విద్యుత్ హీటర్ పెట్టి డ్వాక్రా రుణాల మంజూరుకు బయటకు వెళ్లి తీర్మానాలు రాస్తుండగా.. ఇల్లు కాలిపోతుందని గ్రామస్తులు తెలిపారు. ఇంటి వద్దకు వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా ఆమె కుడి చేతికి గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, బట్టలు, నగదు డబ్బులు, ఇతర వస్తువులు మంటల్లో కాలిపోయాయి. సుమారు రూ.4 నుంచి 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు తెలిపింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఆర్‌ఐ విజయలక్ష్మి పంచనామా నిర్వహించారు.
రూ.5 లక్షల ఆస్తి నష్టం


