ఇక భగ భగలే... | - | Sakshi
Sakshi News home page

ఇక భగ భగలే...

Mar 3 2026 9:19 AM | Updated on Mar 3 2026 9:19 AM

మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026 ● తీవ్రమైన వడగాల్పులు ● మూడు నెలల పాటు గరిష్టం కంటే అధికం ● వాతావరణ శాఖ హెచ్చరిక

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026
ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు
● తీవ్రమైన వడగాల్పులు ● మూడు నెలల పాటు గరిష్టం కంటే అధికం ● వాతావరణ శాఖ హెచ్చరిక

ఫిబ్రవరి, మార్చిలో ఉష్ణోగ్రతలు ఇలా..

తేదీ గరిష్టం కనిష్టం

ఫిబ్రవరి 23 32 23

ఫిబ్రవరి 24 32 20

ఫిబ్రవరి 25 33 21

ఫిబ్రవరి 26 33 20

ఫిబ్రవరి 27 34 21

ఫిబ్రవరి 28 34 21

మార్చి 1 35 22

మార్చి 2 35 21

తేదీ గరిష్టం కనిష్టం

మార్చి 3 36 18

మార్చి 4 36 20

మార్చి 5 36 18

మార్చి 6 37 19

మార్చి 7 37 20

మార్చి 8 34 20

మార్చి 9 37 21

మార్చి 10 36 22

నారాయణఖేడ్‌: ఈ వేసవిలో ఎండలు అత్యంత తీవ్రంగా ఉండనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి ప్రారంభంతోనే భానుడి భగ భగ మొదలైంది. క్రమంగా ఎండల తీవ్రత అధికమవుతుంది. గత రెండు, మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సారి వేడిగాలులు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి నుంచి మే నెల వరకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వేడి గాలుల పెరుగుదలతో జిల్లాలో అత్యంత తీవ్రమైన ఎండలు ఉండనున్నాయి. ఈ ఏడాది అత్యంత వేడిగా ఉండే వేసవిని చూడాల్సి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. పగటి ఉష్ణోగ్రత లు సాధారణం కంటే అధికంగా ఉన్నాయి. మార్చిలోనే ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయని.. ఏప్రిల్‌లో పరిస్థితులు మరీ దారుణంగా మారి సగటు కంటే వేడిగా ఉండే పరిస్థితులు కన్పిస్తాయని పేర్కొంటున్నారు. రాత్రి ఫూట ఉష్ణోగ్రత లు కూడా సాధారణం కంటే అధికంగానే ఉండను న్నాయని చెబుతున్నారు. వేసవిలో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే జిల్లా లకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

వేసవిలో ఇబ్బందులే..

అధిక ఉష్ణోగ్రతలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. ఎండల కారణంగా తాగునీటి ఇబ్బందులు కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్‌ అధిక వినియోగం కూడా ఉండనుంది. పంటలపై వేసవి ఎండల ప్రభావం అధికంగా ఉండి దిగుబడులు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. వారం క్రితం జిల్లాలో అక్కడక్కడ కురిసిన వడగళ్ల వర్షం వల్ల సాగులో ఉన్న జొన్న, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement