టీటీడీలో విజిలెన్స్ వరుస వైఫల్యాలతో అపచారాలు చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా సిబ్బంది వైఫల్యం చోటుచేసుకుంది.
తప్పతాగిన ఓ వ్యక్తి ఆలయం గొపురం ఎక్కి మద్యం ఇస్తేనేగానీ దిగనంటూ హల్ చల్ చేశాడు.
ఈ క్రమంలో ఆలయ కలశాలను ధ్వంసం చేసే బెదిరింపులకు దిగాడు.
శుక్రవారం రాత్రి ఏకాంత సేవ ముగిశాక మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడు.
విజిలెన్స్ సిబ్బంది గుర్తించేలోపే ఆలయం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు.
మహాద్వారం లోపల ఉన్న ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగే ప్రయత్నం చేశాడు.
అర్ధరాత్రి పూట అతడిని కిందికి దించేందుకు పోలీసులు నానా తిప్పలు పడ్డారు
కిందకు రమ్మని బతిమాలిన వినకుండా.. ఒక రాడ్‌తో ఆలయ కలశాలను ధ్వంసం చేస్తానంటూ బెదిరించాడు
90 ఎంఎల్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టాడు ఆ తాగుబోతు
చేసేది లేక ఫైర్ సిబ్బందికి విజిలెన్స్ సిబ్బంది కబురు పంపారు
ఫైర్ సిబ్బంది నిచ్చెనలతో ఆలయంలోకి ప్రవేశించారు
ఆలయ గోపురానికి నిచ్చెనలు వేసి తాగుబోతు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేశారు
తాళ్ల సాయంతో అతికష్టం మీద అతగాడిని కిందకు దించారు
అయితే కవరేజ్ కోసం వెళ్లిన మీడియాతో.. సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు
సదరు తాగుబోతుని నిజామాబాద్ జిల్లాకు చెందిన కె.తిరుపతిగా గుర్తించారు.
ఆధార్ కార్డ్ వివరాల ఆధారంగా అతని ఐడెంటిటీని పోలీసులు నిర్ధారించుకున్నారు
తిరుపతిని ఈస్ట్ పీఎస్‌కి తరలించి విచారణ జరుపుతున్నారు
ఈ ఘటనతో .. మరీ ఇంత అధ్వాన్నమా? అంటూ భక్తులు టీటీడీ విజిలెన్స్ తీరును తప్పుబడుతున్నారు.


