breaking news
Sri Govindaraja Swamy
-
గోవిందరాజస్వామి ఆలయ ఘటన కేసులో కీలక పరిణామం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు కుత్తడి తిరుపతిని గత రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఆలయ గోపురం ఎక్కి.. తాను కోరినంత మద్యం ఇవ్వకుంటే కలశాలను ధ్వంసం చేస్తానంటూ హల్చల్ చేశాడు కుత్తడి తిరుపతి. జనవరి 2 రాత్రి ఏకాంత సేవ ముగిశాక ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో భక్తులతోపాటే లోనికి చొరబడిన తిరుపతి.. ఆలయం మూసేశాక కర్ర ఏర్పాట్ల మీదుగా ఆలయ గొపురం ఎక్కాడు. విజిలెన్స్ సిబ్బంది నిద్రమత్తులో ఈ విషయం గమనించలేదని తెలుస్తోంది. అయితే.. ఆ తర్వాత గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది తిరుపతిని దిగమని ఎంత బతిమాలినా వినలేదు. చివరకు.. 3 గంటలపాటు శ్రమించి నిచ్చెన సాయంతో బలవంతంగా అతన్ని కిందకు తీసుకొచ్చారు. అయితే కిందకు దిగిన తిరుపతి తొలుత తనను చంపేస్తారని బెదిరించారని.. అందుకే పైకి ఎక్కానంటూ పొంతన లేని మాటలు మాట్లాడాడు. అయితే.. మద్యం మత్తులోనే అతను ఈ అపచారానికి పాల్పడ్డాడని.. ఆధార్ కార్డ్‌ను బట్టి నిజామాబాద్‌కు చెందిన వ్యక్తిగా తిరుపతి ఈస్ట్ పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని పీఎస్‌కు తరలించిన పోలీసులు.. నిన్న రాత్రి సమయంలో జడ్జి ముందు ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ నెల 12వ తేదీ దాకా రిమాండ్ విధించడంతో తిరుపతి సబ్ జైలు కు తరలించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ ప్రతిష్ట పూర్తిగా మంటగలుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ సేవల్లో తరలిస్తూ సామాన్యులను పట్టించుకోవడం లేదని.. పైగా వరుస అపచారాలు జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు ఉండడం లేదని.. ఒక తాగుబోతు ఆలయ గోపురం మీదకు ఎక్కి కలశాలు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందంటే విజిలెన్స్ నిఘా ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని.. మరి ముఖ్యంగా సనాతనం గురించి మాట్లాడే పవన్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం దారుణమంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. -
‘ శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో జరిగిన ఘటన దారుణాతి దారుణం’
తిరుపతి: శ్రీ గోవింద రాజస్వామి ఆలయం రాజగోపురంపై ఒక తాగుబోతు కలశాలు పైకి ఎక్కి, మందు కావాలి అంటూ డిమాండ్ చేశాడు అంటే భద్రత డొల్ల ఏస్థాయిలో ఉందో బయట పడిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. గోవింద రాజస్వామి ఆలయం లో జరిగిన ఘటన దారుణాతి. దారుణమన్నారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిటిడి ప్రతిష్ట పూర్తి గా మంటగలిపేలా చర్యలు ఉన్నాయి. ఎంత సేపు మేము గొప్పలు చేశాము అని చెప్పుకోవడమే తప్పా, ఆలయ పరిరక్షణ కోసం చేసింది ఏమి లేదు. టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు వీఐపీ సేవల్లో తరిస్తూ పూర్తిగా ఆలయ ప్రతిష్ట మంటగలుపుతున్నాడు. తిరుమల కొండపై మద్యం, మాంసం ఎక్కడ చూసినా దొరుకుతోంది. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు చిట్టా ఎందుకు తక్కువగా ఇచ్చారు . బీఆర్ నాయుడు దర్శనాలు చిట్టా బయటపెట్టాలి. భక్తులు గోడు పట్టించుకోవడం మానేశారు. తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలేదు. సీఎంవో నుంచి వచ్చిన సిఫార్సులు లేఖలుకే దర్శనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటే ధ్వజమెత్తారు భూమన.కాగా, టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం బయటపడింది. గత రాత్రి విజిలెన్స్ కళ్లు గప్పి ఆలయంలోకి దూరిన ఓ వ్యక్తి.. ఆలయ గోపురం పైకి ఎక్కి మద్యం ఇస్తేనేగానీ కిందకు దిగనంటూ హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో కలశాలను పెకిలించే బెదిరింపులకు దిగాడు. అయితే పోలీసులు అతికష్టం మీద అతన్ని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. -
టీటీడీ విజిలెన్స్.. మరీ ఇంత అధ్వాన్నమా? (ఫొటోలు)
-
టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం
సాక్షి, తిరుపతి: టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం బయటపడింది. గత రాత్రి విజిలెన్స్ కళ్లు గప్పి ఆలయంలోకి దూరిన ఓ వ్యక్తి.. ఆలయ గోపురం పైకి ఎక్కి మద్యం ఇస్తేనేగానీ కిందకు దిగనంటూ హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో కలశాలను పెకిలించే బెదిరింపులకు దిగాడు. అయితే పోలీసులు అతికష్టం మీద అతన్ని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి ఏకాంత సేవ తర్వాత ఆలయం మూసివేశారు. అయితే ఆ సమయంలో భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మద్యం మత్తులో ఉన్న ఆలయంలోకి చొరబడ్డాడు. విజిలెన్స్ సిబ్బంది చూసే లోపే గోడ దూకి లోపలికి చొరబడ్డాడు. నేరుగా మహాద్వారం లోపల ఆలయ గోపురం ఎక్కాడు. అక్కడ నిల్చుని.. 90 ఎంఎల్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందకి దిగనంటూ హల్ చల్ చేశాడు. అది గమనించిన విజిలెన్స్ సిబ్బంది కిందకు రావాలంటూ బతిమాలారు. చేతిలో రాడ్‌తో ఆలయ కలశాలను ధ్వంసం చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఫైర్ సిబ్బందిని రప్పించి గోపురానికి నిచ్చెనలు వేసి తాళ్లతో బంధించి బలవంతంగా కిందకు దించారు. ఈ చర్యకు పోలీసులు మూడు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. అదే సమయంలో.. అర్ధరాత్రి కవరేజ్‌కు వచ్చిన మీడియాపై ఫైర్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.సదరు వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మ వాడ పెద్దమల్లా రెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతిగా గుర్తించారు. మద్యం మత్తులోనే ఆ వ్యక్తి అలా చేశాడని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ప్రస్తుతం అతన్ని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆలయ కలశాలు పాక్షిక్షంగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. టీటీడీ స్పందనశ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మద్యం మత్తులో ఆలయం గోపురంపై హాల్ చల్ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ‘‘నిన్న రాత్రి నిజామాబాద్‌కు చెందిన తిరుపతి అనే వ్యక్తి.. ఇతర భక్తులలాగే ఆలయంలోకి ప్రవేశించాడు. ఉన్నట్లుండి అతను అక్కడ ఉన్న టెంట్ కొయ్యల ద్వారా నడిమి గోపురం పైకి ఎక్కాడు. విధుల్లో ఉన్న విజిలెన్స్ సిబ్బంది అతనిని గుర్తించి పోలీసు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మద్యం మత్తులో ఉన్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు అని టీటీడీ సీపీఆర్వో తెలిపారు. -
ఫిబ్రవరి 4న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి
తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా స్వామివారు దేవేరులతో కలిసి ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.తెల్లవారు జామున 3 నుండి 5 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంతో శ్రీగోవిందరాజస్వామి వారి వాహన సేవలు ప్రారంభమవుతాయి.ఉదయం 8 నుండి 9 గంటల వరకు హంస వాహనం, ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పెద్దశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2.30 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం, మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.రాత్రి 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు గరుడ వాహనాన్ని అధిష్టించి శ్రీవారు దర్శనమిస్తారు. రథసప్తమి వేడుకలను అర్ధ బ్రహ్మోత్సవమని, ఒక రోజు బ్రహ్మోత్సవమని కూడా భక్తులు అంటారు. TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంతిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. .శ్రీవారి దర్శనానికి రెండు కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు74,742 మంది స్వామివారిని దర్శించుకోగా 22,466 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.67 కోట్లు సమర్పించారు.దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
కల్పవృక్ష వాహనంపై గోవిందుడి వైభవం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం ఉదయం గోవిందరాజస్వామి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ వాయిద్య విన్యాసాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వాహన సేవ అనంతరం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. సుగంధ పరిమళాలు, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి సర్వభూపాల వాహన సేవ సాగింది. కార్యక్రమంలో పెదజీయంగార్, చిన్నజీయంగార్, టీటీడీ స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో చంద్రశేఖర్‌పిళ్లై, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ కళావేదికలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో భాగంగా గోవిందరాజస్వామి ఆలయంలో ఉదయం ఎస్కె.స్వర్ణకుమారి బృందం విష్ణుసహస్రనామ పారాయణం సాగింది. అనంతరం కే.రవీంద్రరెడ్డి పురాణ ప్రవచనం, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోవిందరాజస్వామి పుష్కరిణిలో రాత్రి ఎం.వాణి హరికథ పారాయణం చేశారు. మహతి కళాక్షేత్రంలో చెన్నైకు చెందిన జే.జనని బృందం ప్రదర్శించిన భక్తి సంగీతం అలరించింది. రామచంద్ర పుష్కరిణి వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల హరికథా కాలక్షేపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నేడు గరుడ సేవ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గరుడ సేవ జరగనుంది. ఉదయం పల్లకీ సేవ నిర్వహించనున్నారు. -
హంస వాహనంపై గోవిందుడి చిద్విలాసం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం సాయంత్రం స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు చిన్నశేష వాహనాన్ని అధిరోహించి భక్తులకు కనువిందు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం సర్వాంగ శోభితుడై స్వామివారు చిన్నశేష వాహనంలో కొలువుదీరి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. స్వామివారి వాహనం ముందు భక్త బృందాలు ప్రదర్శించిన కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయంలోని కల్యాణ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఊంజల సేవ చేశారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు హంస వాహనంపై స్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. షడగోప రామానుజ పెదజీయంగార్, గోవింద రామానుజ చిన్నజీయర్, టీటీడీ స్థానికాలయాల డెప్యూటీ ఈవో చంద్రశేఖర్‌పిళ్లై, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూ డో రోజైన శుక్రవారం ఉదయం సింహ, రాత్రి ముత్యపు పందరి వాహన సేవలు జరుగనున్నాయి.


