తిరుపతి: శ్రీ గోవింద రాజస్వామి ఆలయం రాజగోపురంపై ఒక తాగుబోతు కలశాలు పైకి ఎక్కి, మందు కావాలి అంటూ డిమాండ్ చేశాడు అంటే భద్రత డొల్ల ఏస్థాయిలో ఉందో బయట పడిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. గోవింద రాజస్వామి ఆలయం లో జరిగిన ఘటన దారుణాతి. దారుణమన్నారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిటిడి ప్రతిష్ట పూర్తి గా మంటగలిపేలా చర్యలు ఉన్నాయి. ఎంత సేపు మేము గొప్పలు చేశాము అని చెప్పుకోవడమే తప్పా, ఆలయ పరిరక్షణ కోసం చేసింది ఏమి లేదు.
టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు వీఐపీ సేవల్లో తరిస్తూ పూర్తిగా ఆలయ ప్రతిష్ట మంటగలుపుతున్నాడు. తిరుమల కొండపై మద్యం, మాంసం ఎక్కడ చూసినా దొరుకుతోంది. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు చిట్టా ఎందుకు తక్కువగా ఇచ్చారు . బీఆర్ నాయుడు దర్శనాలు చిట్టా బయటపెట్టాలి. భక్తులు గోడు పట్టించుకోవడం మానేశారు. తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలేదు. సీఎంవో నుంచి వచ్చిన సిఫార్సులు లేఖలుకే దర్శనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటే ధ్వజమెత్తారు భూమన.
కాగా, టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం బయటపడింది. గత రాత్రి విజిలెన్స్ కళ్లు గప్పి ఆలయంలోకి దూరిన ఓ వ్యక్తి.. ఆలయ గోపురం పైకి ఎక్కి మద్యం ఇస్తేనేగానీ కిందకు దిగనంటూ హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో కలశాలను పెకిలించే బెదిరింపులకు దిగాడు. అయితే పోలీసులు అతికష్టం మీద అతన్ని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు.



