కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్-1. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఏడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.
ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కాంతార టీమ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మూవీ షూటింగ్ సహకరించిన అన్నదమ్ములకు శుభాకాంక్షలు తెలిపారు. కుందాపురకు చెందిన ఉవా మెరిడియన్ ఫిల్మ్ స్టూడియో యాజమానులు ఉదయ్ కుమార్ శెట్టి, వినయ్ కుమార్ శెట్టి తమ సినిమా కాంతార చాప్టర్-1 ఎంతో సహకరించారని అన్నారు. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ కోసం 22 వేల చదరపు అడుగుల ఏసీ సెట్‌ను రూపొందించారని వెల్లడించారు. ఇందులోనే ఇండోర్ సీక్వెన్స్ తెరకెక్కించామని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తన మూవీకి మద్దతుగా నిలిచిన మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటామని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాంతార చాప్టర్-1 మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. రిషబ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ సినిమా ఛావాను అధగమించింది. అంతేకాకుండా కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మూవీగా ఘనత సాధించింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు.
Uday Kumar Shetty and Vinay Kumar Shetty, the dynamic brothers from Kundapura and proud owners of Uva Meridian!. They helped to build a 22,000 sq.ft A/C floor for shooting Kantara Chapter 1, where all of our indoor sequences was shot. We remain thankful for their constant support… pic.twitter.com/hUPGm3F4qy
— Rishab Shetty (@shetty_rishab) November 1, 2025


