8 ఏళ్ల తర్వాత 'పార్టీ' ఇవ్వనున్న రెజీనా, రమ్యకృష్ణ | Venkat Prabhu Party Movie 8 Years After Will Be Released Plan, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

8 ఏళ్ల తర్వాత 'పార్టీ' ఇవ్వనున్న రెజీనా, రమ్యకృష్ణ

Dec 18 2025 7:04 AM | Updated on Dec 18 2025 10:30 AM

venkat prabhu Party movie 8 years after will be released plan

తమిళసినిమా: ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగదు. అందుకు పలు కారణాలు ఉంటాయి. ఇది చిత్రాలకు అతీతం కాదు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్నా, కొన్ని చిత్రాల విడుదలకు ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఉదాహరణకు మదగజరాజానే తీసుకుంటే నిర్మాణం పూర్తి చేసుకుని  పలు అవరోధాలను ఎదురొడ్డి 12 ఏళ్ల తరువాత తెరపైకి వచ్చింది. విశాల్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుందర్‌.సీ దర్శకుడు అయినప్పుటికీ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాంటి మ్యాజిక్‌ పార్టీ చిత్రానికి వర్కౌట్‌ అవుతుందా? అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. 

వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం పార్టీ.. మిర్చి శివ, జయ్, రెజీనా, రమ్యకృష్ణ, నివేదాపేతురాజ్, జయరామ్, సత్యరాజ్‌ వంటి ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రానికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 8 ఏళ్ల క్రితం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇప్పటికీ తెరపైకి రాలేదు. మధ్యలో చిత్ర వర్గాలు చాలా ప్రయత్నాలు చేశారు. తాజాగా పార్టీ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో పార్టీ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వెంకట్‌ప్రభు చిత్రాలకు కాలంతో పనిఉండదు. ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పార్టీ చిత్రం కూడా సక్సెస్‌ అవుతుందని భావిద్దాం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement