టాలీవుడ్ నటుడు నవదీప్ కథానాయకుడిగా భారీ అంచనాలతో నటించిన చిత్రం లవ్ మౌళి.. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గ నిలిచింది. అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఫంకూరీ గిద్వానీ హీరోయిన్‌గా నటించింది. సుమారు ఏడాది తర్వాత ఈ మూవీ ఫలితం గురించి నవదీప్ రియాక్ట్ అయ్యారు. ఈ చిత్రం రిజల్ట్ తనను భావోద్వేగ స్థాయిలో తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆయన అన్నారు.

లవ్ మౌళి సినిమా వైఫల్యాన్ని గుర్తుచేసుకుంటూ.. నవదీప్ ఇలా అన్నారు. 'ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో నన్ను బాగా కుంగతీసింది. చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాం. నాపై ఈ మూవీ ఫలితం తీవ్రంగా ప్రభావితం చేసింది. చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది కూడా.. విడుదల తర్వాత వచ్చిన టాక్‌తో నిరాశ చెందాను. దానిని తట్టుకోవడం చాలా కష్టమనిపించింది. నా జీవితంలో చాలా బాధాకరమైన అనుభవంగా అది మిగిలిపోతుంది.
ఈ సినిమా విడుదల తర్వాత కొంతకాలం పరిశ్రమకు దూరంగా ఉన్నాను. పెర్త్‌లోని నా సోదరి ఇంట్లో దాదాపు మూడు నెలలు ఉన్నాను. ఇక నటనను పూర్తిగా మానేయాలని కూడా భావించాను. అయితే, సమయం అన్నీ మార్చేస్తుంది. కొంత కాలం తర్వాత తిరిగి ప్రయత్నాం చేయాలనిపించింది. అలా ధండోరా మూవీతో ప్రేక్షకుల వద్దకు మళ్లీ వస్తున్నాను.' అని నవదీప్ గుర్తుచేసుకున్నారు.


