విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా ఓకేసారి రెండు ఓటీటీల్లో రిలీజ్ కావడం విశేషం. ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వేదికగా సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు.
కథేంటంటే..
చైతన్య(విక్రాంత్) హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తన స్నేహితుడి సుబ్బు(అభినవ్ గోమఠం)ని ఎంగ్జామ్ సెంటర్‌లో డ్రాప్ చేయడానికి వెళ్లగా.. అక్కడ కల్యాణి(చాందిని చౌదరి) చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెది వరంగల్ అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. కల్యాణి తండ్రి ఈశ్వరరావు(మురళీధర్ గౌడ్)కు ఈ విషయం తెలిసి.. ఆమెను కలవకుండా చేసి చైతన్యను తిరిగి పంపిస్తాడు. ఓ సంఘటనతో చైతన్య, కల్యాణి మళ్లీ కలుస్తారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి..అది కాస్త ప్రేమగా మారుతుంది. ఈశ్వరరావు ఒప్పుకోడని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. బిడ్డ పుడితే ఆయనే దగ్గరకు వస్తాడని జాక్ (తరుణ్ భాస్కర్) ఇచ్చిన సలహాతో కాపురాన్ని ప్రారంభిస్తారు.
కొన్నాళ్ల తర్వాత చెకప్ కోసం ఆస్పత్రికి వెళితే.. చైతన్యకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని..బిడ్డలు పుట్టే అవకాశం లేదని చెబుతారు. ఈ విషయం భార్యకు తెలియనీయకుండా జాగ్రత్త పడతాడు చైతన్య. అదే సమయంలో ఈశ్వరరావు వీరింటికి వస్తాడు. కూతురుతో ప్రేమగా మాట్లాడుతూనే..‘ఎలాగైన మీ ఇద్దరి విడగొట్టి నా కూతురిని తీసుకొని వెళ్తానని’ అల్లుడికి వార్నింగ్ ఇస్తాడు. ఒకవైపు పిల్లలు పుట్టరేమోననే బాధ..మరోవైపు మామ వార్నింగ్‌తో చైతన్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న కల్యాణిని దక్కించుకునేందుకు ఆయన పడిన కష్టాలు ఏంటి? కూతురిని చైతన్యకు దూరం చేయడానికి ఈశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఏంటి? అవి ఫలించాయా లేదా? ఒకవైపు నాన్న..మరోవైపు భర్త చూపించిన అతిప్రేమ కల్యాణిని ఎలా ఇబ్బందికి గురి చేసింది? చైతన్యకు స్పెర్మ్‌కౌంట్ తక్కువ ఉందనే విషయం కల్యాణికి తెలిసిన తర్వాత ఎం జరిగింది? చివరకు చైతన్య-కల్యాణికి పిల్లలు పుట్టారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
One film.
Two major OTT platforms.
An interesting OTT release 📺#SanthanaPrapthirasthu streaming on both #AmazonPrime & #JioHotstar from Dec 19 🎥 pic.twitter.com/G6m0l9NL8l— Suresh PRO (@SureshPRO_) December 17, 2025


