ప్రభాస్ ది రాజాసాబ్‌.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది | The RajaSaab Movie Sahana Sahana Song out now | Sakshi
Sakshi News home page

The RajaSaab Movie: ప్రభాస్ ది రాజాసాబ్‌.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది

Dec 17 2025 8:41 PM | Updated on Dec 17 2025 9:27 PM

The RajaSaab Movie Sahana Sahana Song out now

రెబల్ స్టార్ డార్లింగ్‌ ప్రభాస్‌ -మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్‌ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్‌, మాళవికా మోహన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. సహనా సహనా అంటూ సాంగే రొమాంటిక్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.

తాజాగా రిలీజైన ఈ పాట ప్రభాస్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది.  ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా, తమన్ ఎస్, శృతి రంజనీ ఆలపించారు. ఈ పాటను తమన్ కంపోజ్ చేశారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కృతీ ప్రసాద్‌ నిర్మించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement