సన్నీ మాదాల, మౌనిక జంటగా నటిస్తోన్న చిత్రం ఓ టార్చర్ ప్రేమ. ఈ మూవీకి శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా మాదాల రంగారావు మనవడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మౌనిక సైతం ఈ చిత్రం ద్వారానే హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.
పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ' మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల మూడోతరం హీరో పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం ప్రేమ మార్గంని ఎన్నుకున్నాడు. ఓ టార్చర్ ప్రేమ అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి అని అన్నారు.
దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రంలో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు కీలక పాత్రలు పోషించారు.


