బుల్లెట్‌ సునీల్‌గా రాజశేఖర్‌.. గ్లింప్స్‌ చూశారా? | Biker Movie: Dr Rajasekhar as Bullet Sunil Glimpse Out | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ సునీల్‌: రాజశేఖర్‌ కమ్‌బ్యాక్‌ గ్యారెంటీ!

Feb 4 2026 5:25 PM | Updated on Feb 4 2026 5:42 PM

Biker Movie: Dr Rajasekhar as Bullet Sunil Glimpse Out

'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు హీరో శర్వానంద్‌. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం బైకర్‌. ఇందులో శర్వానంద్‌ బైకర్‌గా నటించాడు. పర్ఫెక్ట్‌ బైకర్‌గా కనిపించేందుకు ప్రత్యేకమైన ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. బాగా బరువు తగ్గాడు కూడా! ఈ మూవీ ఏప్రిల్‌ 3న విడుదల కానున్నట్లు ప్రకటించారు.

బుల్లెట్‌ సునీల్‌
బుధవారం (ఫిబ్రవరి 4న) నాడు బైకర్‌ నుంచి బుల్లెట్‌ సునీల్‌ను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ వదిలారు. ఈ స్పోర్ట్‌ క్రికెట్‌ కాదు సునీల్‌, ఎవరూ పట్టించుకోరు. టైం వేస్ట్‌ చేసుకోకు అన్న వాయిస్‌తో టీజర్‌ మొదలైంది. 'సునీల్‌ మాజీ మోటోక్రాస్‌ రేసర్‌, అప్పట్లో బుల్లెట్‌ సునీల్‌ అనేవారు.

కీలక పాత్రలో రాజశేఖర్‌
18 ఇండియన్‌ ఛాంపియన్‌షిప్స్‌.. 57 సౌత్‌ జోన్‌ టైటిల్స్‌.. 100కి పైగా రేసుల్లో పాల్గొన్నాడు' అంటూ రాజశేఖర్‌ను రేసర్‌గా పరిచయం చేశారు. గ్లింప్స్‌లో రాజశేఖర్‌ లుక్స్‌ చూస్తుంటే గట్టి కమ్‌బ్యాక్‌ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో సింహరాశి, అల్లరి ప్రియుడు వంటి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజశేఖర్‌. 2017లో పీఎస్‌ గరుడవేగతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ ఆకట్టుకోలేకపోయాడు.

సినిమా
బైకర్‌ విషయానికి వస్తే మూడు తరాల నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బైక్‌ చేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రల్లో యాక్ట్‌ చేశారు. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వహించాడు.

 

చదవండి: 2 నెలలుగా నరకం చూస్తున్నా: వడాపావ్‌ గర్ల్‌

Advertisement
 
Advertisement
Advertisement