రవితేజ సోదరుడి తనయుడి చిత్రం.. టీజర్ రిలీజ్ | Maadhav Bhupathiraju Latest Movie Maremma Teaser Out Now | Sakshi
Sakshi News home page

Maremma Teaser: రియల్ స్టోరీ మారెమ్మ.. టీజర్ రిలీజ్‌

Feb 4 2026 5:16 PM | Updated on Feb 4 2026 5:35 PM

Maadhav Bhupathiraju Latest Movie Maremma Teaser Out Now

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా కనిపించనున్నారు.

తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మకు పూజలు చేయడం టీజర్‌లో చూపించారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement