దురంధర్-2 క్రేజ్‌.. బాక్సాఫీస్ రికార్డ్స్ గల్లంతేనా? | Ranveer singh Dhurandhar 2 will create Box Office new rocords In march | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Movie: దురంధర్-2 క్రేజ్‌.. ఆ రికార్డ్స్ గల్లంతేనా?

Feb 4 2026 6:32 PM | Updated on Feb 4 2026 7:14 PM

Ranveer singh Dhurandhar 2 will create Box Office new rocords In march

గతేడాది డిసెంబరులో రిలీజై సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ సినిమా 'ధురంధర్'. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఛావా, కాంతార-2ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్‌లోనే దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన చిత్రంగా ఘనత సాధించింది.

కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్, బాహుహలి, పుష్ప లాంటి సినిమాలను అధిగమించింది. ఇదే మూలవీ దక్షిణాది భాషల్లో కూడా విడుదలై ఉంటే మరిన్ని రికార్డుల తిరగరాసేదని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

దక్షిణాది భాషల్లో సీక్వెల్ రిలీజ్

కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ మూవీ సీక్వెల్‌ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్‌ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సారి దక్షిణాది మార్కెట్‌లోనూ దురంధర్-2 విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

భారతీయ చిత్రాల జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో దంగల్, పుష్ప-2, బాహుబలి-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దురంధర్‌ మూవీ హిందీలో మాత్రమే రిలీజై కేజీఎఫ్‌, బాహుబలి, పుష్ప చిత్రాల రికార్డులను దాటేసింది. ఈ నేపథ్యంలో మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న దురంధర్-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఆ రికార్డ్స్ గల్లంతేనా?

ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌  దంగల్, పుష్ప-2, బాహుబలి-2 లాంటి చిత్రాలను రికార్డులను అధిగమించేలా కనిపిస్తోంది. దురంధర్‌కు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఇది సాధ్యమేనని అనిపిస్తోంది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్‌ వల్ల టాలీవుడ్ సినిమాలు సైతం వాయిదా పడుతున్నాయి. డకాయిట్, పెద్ది సినిమాలు పోస్ట్‌ పోన్ చేసి కొత్త తేదీలను ప్రకటించారు. దురంధర్-2 దెబ్బకు టాలీవుడ్ చిత్రాలు తప్పుకోవడం చూస్తే బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమేనని అర్థమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement