ఓటీటీకి మనశంకర వరప్రసాద్‌గారు... అఫీషియల్ డేట్ వచ్చేసింది | Mana Shankara Vara Prasad Garu Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Mana Shankara Vara Prasad Garu OTT: ఓటీటీకి మనశంకర వరప్రసాద్‌గారు... అఫీషియల్ ప్రకటన

Feb 4 2026 9:16 PM | Updated on Feb 5 2026 4:26 PM

Mana Shankara VaraPrasad Garu Movie Ott Release date Revealed

మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

బాక్సాఫీస్‌ వద్ద హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయినప్పటికీ ఫిబ్రవరి 11 నుంచే ఓటీటీకి రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా జీ5 తమ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల జాబితాను రివీల్ చేసింది. ఇందులో మనశంకర వరప్రసాద్‌గారు ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్‌కు రానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో టాలీవుడ్ సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా శివ కార్తికేయన్ హీరోగా  నటించిన పరాశక్తి మూవీ స్ట్రీమింగ్ డేట్‌ కూడా తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. 

Advertisement
 
Advertisement
Advertisement