breaking news
Santhana Prapthirasthu Movie
-
“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ఆ సినిమాల తర్వాత సంతాన ప్రాప్తిరస్తు: మధుర శ్రీధర్ రెడ్డి
‘‘ఒక వినోదాత్మక మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మా ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్‌తో అర్థం అయింది. ‘ఆయ్, లిటిల్ హార్ట్స్’ వంటి చిత్రాల తర్వాత అలాంటి హోల్ సమ్ ఎంటర్టైనర్ మా ‘సంతాన ప్రాప్తిరస్తు’ అంటుండటం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి చెప్పారు. విక్రాంత్, చాందినీ చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో విక్రాంత్ మాట్లాడుతూ–‘‘మా సినిమా చూసిన వారు మా నటన, టెక్నీషియన్స్ వర్క్ గురించి మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘థియేటర్స్‌కు వెళ్లి చూశాను.. ఆడియన్స్ స్పందన చూశాక సంతోషంగా అనిపించింది’’ అన్నారు చాందినీ చౌదరి. ‘‘కొత్త తరహా కంటెంట్ చూపిస్తే తాము ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు’’ అని సంజీవ్ రెడ్డి తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడారు. -
సంతాన ప్రాప్తిరస్తు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సంతాన ప్రాప్తిరస్తునటీనటులు: విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ తదితరులునిర్మాణ సంస్థ: మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌నిర్మాతలు:మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డిదర్శకత్వం: సంజీవ్ రెడ్డిసంగీతం: సునీల్ కశ్యప్ఎడిటర్: సాయికృష్ణ గనలవిడుదల తేది: నవంబర్ 14, 2025 కథేంటంటే.. చైతన్య(విక్రాంత్) హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన స్నేహితుడి సుబ్బు(అభినవ్ గోమఠం)ని ఎంగ్జామ్ సెంటర్లో డ్రాప్ చేయడానికి వెళ్లగా.. అక్కడ కల్యాణి(చాందిని చౌదరి) చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెది వరంగల్ అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. కల్యాణి తండ్రి ఈశ్వరరావు(మురళీధర్ గౌడ్)కు ఈ విషయం తెలిసి.. ఆమెను కలవకుండా చేసి చైతన్యను తిరిగి పంపిస్తాడు. ఓ సంఘటనతో చైతన్య, కల్యాణి మళ్లీ కలుస్తారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి..అది కాస్త ప్రేమగా మారుతుంది. ఈశ్వరరావు ఒప్పుకోడని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. బిడ్డ పుడితే ఆయనే దగ్గరకు వస్తాడని జాక్ (తరుణ్ భాస్కర్) ఇచ్చిన సలహాతో కాపురాన్ని ప్రారంభిస్తారు. కొన్నాళ్ల తర్వాత చెకప్ కోసం ఆస్పత్రికి వెళితే.. చైతన్యకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని..బిడ్డలు పుట్టే అవకాశం లేదని చెబుతారు. ఈ విషయం భార్యకు తెలియనీయకుండా జాగ్రత్త పడతాడు చైతన్య. అదే సమయంలో ఈశ్వరరావు వీరింటికి వస్తాడు. కూతురుతో ప్రేమగా మాట్లాడుతూనే..‘ఎలాగైన మీ ఇద్దరి విడగొట్టి నా కూతురిని తీసుకొని వెళ్తానని’ అల్లుడికి వార్నింగ్ ఇస్తాడు. ఒకవైపు పిల్లలు పుట్టరేమోననే బాధ..మరోవైపు మామ వార్నింగ్‌తో చైతన్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న కల్యాణిని దక్కించుకునేందుకు ఆయన పడిన కష్టాలు ఏంటి? కూతురిని చైతన్యకు దూరం చేయడానికి ఈశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఏంటి? అవి ఫలించాయా లేదా? ఒకవైపు నాన్న..మరోవైపు భర్త చూపించిన అతిప్రేమ కల్యాణిని ఎలా ఇబ్బందికి గురి చేసింది? చైతన్యకు స్పెర్మ్‌కౌంట్ తక్కువ ఉందనే విషయం కల్యాణికి తెలిసిన తర్వాత ఎం జరిగింది? చివరకు చైతన్య-కల్యాణికి పిల్లలు పుట్టారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..మన సొసైటీలో ఇప్పుడు సంతాన లేమి అనే సమస్య ఎక్కువగా ఉంది. భారత్ అత్యధిక జనాభా గల దేశం అయినప్పటికీ.. అత్యధిక ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా ఇక్కడే ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. పని ఒత్తిడి, లైఫ్‌స్టైల్, కొన్ని చెడు అలావాట్లు సంతాన లేమి సమస్యను తెచ్చిపెడుతున్నాయి. అన్నీ బాగున్నా.. లైఫ్ స్టైల్ వల్ల సంతాన లేమి సమస్యలు ఎలా వస్తున్నాయి? ఓ జంట కలిసి ఉండాలంటే పిల్లలు పుట్టాల్సిందేనా? ఫెర్టిలిటీ ఇష్యూ ఎక్కడకు దారి తీస్తుంది? లాంటి సున్నితమైన విషయాలను ఎక్కడా గీత దాటకుండా ఫన్వేలో చూపించాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. అయితే ఈ సెన్సిటీవ్ అంశం సినిమాలో ఒక ఎపిసోడ్ మాత్రమే. మిగతాదంతా రెగ్యులర్ లవ్‌స్టోరీనే. కామెడీ, ఎమోషన్స్‌ని మిక్స్ చేసి ఓ మంచి ప్రేమ కథా చిత్రంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అయితే ఇందులో కామెడీ వర్కౌట్ అయినా.. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. భార్య-భర్త..మధ్యలో నాన్న అన్నట్లుగా కథనం సాగుతుంది. ఫస్టాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల పరిచయం.. ప్రేమ, పెళ్లి చుట్టూ తిరుగుతుంది. ఈ సన్నివేశాలన్నీ రోటీన్‌గానే ఉన్నా..మధ్య మధ్యలో అభినవ్ గోమఠం వేసే కామెడీ పంచులు నవ్విస్తాయి. అలాగే తరుణ్ భాస్కర్ తన గ్యాంగ్‌పై వేసే పంచులు కూడా బాగానే పేలాయి. హీరోకి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందనే విషయం తెలియడం..అదే సమయంలో హీరోయిన్ తండ్రి విడగొడతానని చాలెంజ్ చేయడం..మరోపక్క ఆఫీస్‌లో పని ఒత్తిడి..ఇవన్నీ హీరో ఎలా ఎదుర్కొంటాడనేది సెకండాఫ్‌లో చూపిస్తామన్నట్లుగా ఇంటర్వెల్ సీన్‌ని కట్ చేశారు. ఫస్టాఫ్ ఫన్వేలో నడిస్తే.. సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. హీరోహీరోయిన్లను విడగొట్టేందుకు మురళీధర్ చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే వెన్నెల కిశోర్ ఎపిసోడ్ కూడా. చివరిలో వచ్చే ఎమోషనల్ సన్నీవేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో హీరోయిన్ చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఓవరాల్‌గా దర్శకుడు ఓ సున్నితమైన అంశాన్ని తీసుకొని, డీసెంట్ కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఎవరెలా చేశారంటే.. సాఫ్వేర్ ఎంప్లాయ్ చైతన్య పాత్రకు విక్రాంత్ న్యాయం చేశాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. పక్కింటి అమ్మాయిలాంటి కల్యాణి పాత్రలో చాందినీ చౌదరి చక్కగా నటించింది. ఎమోషనల్ సీన్లలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. మురళీధర్ గౌడ్ పాత్ర సినిమాకు మరో ప్లస్ పాయింట్. అతి ప్రేమ చూపించే తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. సెకండాఫ్‌లో ఆయన పాత్ర చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక అభినవ్ గోమఠం ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్‌లో ఎంటర్టైన్ చేశాడు. తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్, వెన్నెల కిశోర్ అక్కడక్కడ నవ్వించారంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సునీల్ కశ్యప్ పాటలు అంతగా గుర్తుండవు కానీ.. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రపీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)
-
ట్రైలర్ చాలా బాగుంది: దర్శకుడు బాబీ
‘‘సంతానప్రాప్తిరస్తు’లో ఇన్ఫెర్టిలిటీ లాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను అందరికీ నచ్చేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథను స్క్రీన్ మీదకు తీసుకొచ్చేందుకు ఆరేళ్లు వెయిట్ చేశారు దర్శకుడు సంజీవ్‌గారు. ఓపికగా ఉండటం అనేది గొప్ప విషయం. శ్రీధర్, హరిప్రసాద్గార్లకు మంచి విజయం దక్కాలి’’ అని దర్శకుడు బాబీ చెప్పారు. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకులు బాబీ, సందీప్ రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ రవి, నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శింగనమల కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లాడారు. ‘‘సంతాన సమస్యలు ఉన్నవారు చికిత్స తీసుకోవచ్చు. కానీ అన్నీ బాగుండి లైఫ్ స్టైల్ వల్ల సంతాన లేమితో బాధపడేవారిని ఈ మూవీలో అడ్రస్ చేశాం’’ అని తెలిపారు సంజీవ్ రెడ్డి. -
తొందరొద్దు తమ్ముడు.. పిల్లల్ని కనడానికి టైమ్ తీసుకోండి: టాలీవుడ్ డైరెక్టర్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu). ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్లో హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu)ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియాలో మాత్రమే పెళ్లవ్వగానే పిల్లలెప్పుడు అని అడుగుతారని అన్నారు. బయట ఎక్కడా కూడా ఇలా ఉండదన్నారు. అలా అడగడంతో మనపై స్ట్రెస్ ఉంటుందని తెలిపారు. అయితే పెళ్లయిన పదేళ్ల గ్యాప్ తర్వాతే పిల్లలు ప్లాన్ చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు. అంతే కానీ అనవసరంగా ఒత్తిడికి గురై పిల్లల విషయంలో ఎలాంటి తొందరపాటు వద్దని యువతకు సలహా ఇచ్చారు. శైలేష్ కొలను మాట్లాడుతూ..' నాకు 2012లో మ్యారేజ్ అయింది. నేను, మా వైఫ్ పదేళ్ల తర్వాత పిల్లలు ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యాం. డేటింగ్ టైమ్‌లో అలా ఫిక్సయ్యాం. యంగ్‌స్టర్స్‌కు నేను చెప్పేది ఒక్కటే. పెళ్లయ్యాక పిల్లల కోసం టైమ్ తీసుకోండి. పార్ట్నర్ను అర్థం చేసుకోండి. లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయండి. నా నిజ జీవితం నుంచే ఈ విషయం నేర్చుకున్నా. యూత్‌కు నేను ఇచ్చే సలహా కూడా ఇదే' అని తన అనుభవాన్ని పంచుకున్నారు.కాగా.. ఇప్పటికే రిలీజైన సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. -
హృదయాలను హత్తుకునేలా ‘మరి మరి..’ సాంగ్
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు"(Santhana Prapthirasthu). ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ రోజు ఈ సినిమా నుంచి 'మరి మరి..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఉమా వంగూరి లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే -' మరి మరి నిన్ను వెతికేలా, మరవదు ఓ క్షణమైనా, మనసంతా నీ తలపులే, ప్రతి చోటా నీ గురుతులే, వేచా గడిచిన నిన్నల్లో, వెతికా నడిచిన దారుల్లో, వెలుగే విడిచిన నీడల్లో, వదిలి వెళ్లిన జాడల్లో...'అంటూ ఎమోషనల్ గా సాగుతుందీ పాట. ప్రాణంగా ప్రేమించిన భార్యతో వచ్చిన ఎడబాటు ఎలాంటి బాధను మిగిల్చిందో హీరో వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. -
కొందరు హీరోలు నో చెప్పారు
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu Movie). సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్‌పై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ–‘‘సంతాన ప్రాప్తిరస్తు’ స్క్రిప్ట్‌ని కొందరు పేరున్న హీరోలకు వినిపించాం. కథలో హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత తమ ఇమేజ్‌కు ఇబ్బంది అవుతుందంటూ నో చెప్పారు. కొత్త అబ్బాయితో వెళితే ఎలాంటి ఇమేజ్ ఇబ్బందులు ఉండవని విక్రాంత్‌ను తీసుకున్నాం. మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సాగే ఈ సినిమాలో ఎక్కడా అభ్యంతరకరమైన డైలాగ్స్ లేవు. మా సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది. కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయి. నాలుగేళ్ల క్రితం అయితే ఈ సినిమా ట్రైలర్‌ను మా కుటుంబ సభ్యులకే చూపించలేకపోయేవాడిని. ఇప్పుడు మా అబ్బాయిలు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడగలుగుతున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో ‘సంతానప్రాప్తిరస్తు 2’ చేయాలనుకుంటున్నాం. మన నేటివ్ సినిమాల్లో కంటెంట్ బాగుంటే అదే గ్లోబల్ స్థాయికి వెళ్తుంది. పాఇండియా అవుతుంది. కరోనా తర్వాత ఓటీటీ డీల్స్ విషయంలో మార్పులు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల పేమెంట్స్ తగ్గిస్తున్నారు. భవిష్యత్‌లో నా దర్శకత్వంలో మళ్లీ సినిమా ఉండొచ్చు. కొత్త ఫిల్మ్‌మేకర్స్ మా మధుర ఆడియో పాటలను వినియోగించుకుంటే నేను డబ్బులు చార్జ్ చేయడం లేదు’’ అని అన్నారు. నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ–‘‘ఐటీ రంగం నుంచి వచ్చిన నేను ‘సంతాన ప్రాప్తిరస్తు’ తో నిర్మాతగా పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. -
‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పిల్లలు లేని కపుల్స్ మా సినిమా చూసి ఇబ్బంది పడరు
‘‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో ప్రేమకథ ఉంటుంది. కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న ఓ చిన్న సమస్యను కూడా చూపించాం’’ అని డైరెక్టర్ సంజీవ్ రెడ్డి(Sanjeev Reddy ) చెప్పారు. విక్రాంత్, చాందినీ చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu Movie). మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సంజీవ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. మేల్ ఫెర్టిలిటీ అనే సమస్య నేపథ్యంగా ఇప్పటిదాకా తెలుగులో ఏ మూవీ రాలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఇలాంటి ఇష్యూస్‌తో బాధపడ్డారు. వారికి ఆధునిక వైద్యంతో పిల్లలు పుట్టినప్పటికీ వారు సొసైటీ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు చూశాను. ఈ కాన్సెప్ట్‌తో సినిమా చేస్తే బాగుంటుందని ‘సంతాన ప్రాప్తిరస్తు’ స్క్రిప్ట్ రెడీ చేశాను. ఇలా నేను చూసిన సమస్యతోనే ఈ సినిమా చేశాను. విక్రాంత్‌కి ఈ కథ బాగా నచ్చింది. ఫెర్టి లిటీ ఇష్యూ అనేది మాట్లాడకూడని అంశం కాదు... సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య. మా సినిమాని చూసేందుకు పిల్లలు లేని కపుల్స్గానీ ఫ్యామిలీ ఆడియన్స్ గానీ ఇబ్బంది పడరు. ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యనే మాట్లాడుకునే ఫెర్టిలిటీ అంశాన్ని మా సినిమా చూశాక బహిరంగంగా మాట్లా డతారని అనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
'సినిమా తీయడం గొప్ప కాదు'.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో సినిమాలు తీయడం గొప్పకాదన్నారు. మనం తీసిన సినిమాకు ఆడియన్స్‌ను రప్పించడమే అసలైన సవాల్ అని తెలిపారు. ప్రెస్మీట్స్ పెట్టి ట్రైలర్స్ లాంఛ్ చేయడం కంటే.. మీరిచ్చే కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టాలని సూచించారు. మార్నింగ్ షోకు ఆడియన్స్ తీసుకురావడమే గొప్పదనమన్నారు. మీడియా వాళ్లు కూడా పాజిటివ్‌గా రివ్యూలు ఇస్తే సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలని దిల్ రాజు అన్నారు. మీరు అలా రాసినప్పుడే మార్నింగ్ ఫస్ట్ షోలకు కలెక్షన్స్ పెరుగుతున్నాయని తెలిపారు. సంతాన ప్రాప్తిరస్తు మూవీ ట్రైలర్ లాంఛ్‌కు హాజరైన దిల్ రాజు మాట్లాడారు.కాగా.. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమాలు తీయడాలు, ప్రెస్ మెట్లు పెట్టి ట్రైలర్లు లాంచ్ చేయడం గొప్ప కాదు..మార్నింగ్ షోకు జనాలను తీసుకొచ్చి, సినిమా సక్సెస్ అనిపించుకోవడమే గొప్ప! - #DilRaju#SanthanaPrapthirasthu pic.twitter.com/MxmRCTmP9s— Suresh PRO (@SureshPRO_) November 6, 2025 -
పిల్లల కోసం ఆ మాత్రం చేయలేరా?. సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ చూశారా?
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu Trailer). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చెప్పినమాట విననివాడే కొడుకు.. చెప్పినమాట విన్నట్లు నటించేవాళ్లే కూతురు.. అంతే పెద్దా తేడా లేదు... అనే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. ప్రేమ పెళ్లి తర్వాత పిల్లల కోసం మన హీరో ఎన్ని కష్టాలు పడ్డారనేదే సంతాన ప్రాప్తిరస్తు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. ఈ చిత్రాన్ని పిల్లల దినోత్సవం కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు. -
రామ్ మిరియాల నోట ‘సంతాన ప్రాప్తిరస్తు’ పాట
రామ్ మిరియాల పాడితే ఆ పాట ఛాట్ బస్టర్ కావాల్సిందే. 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..', 'టిల్లు అన్న డీజే పెడితే..', 'ఛమ్కీల అంగీలేసి..', 'ఊరు పల్లెటూరు..', 'టికెట్ ఏ కొనకుండా..', 'సుఫియానా...' ఇలా రామ్ మిరియాల పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ కు ఫేవరేట్ సాంగ్స్ అయ్యాయి. ఈ వెర్సటైల్ సింగర్ "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టైటిల్ సాంగ్ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు.ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు...సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ, ఆల్ ది బెస్టు, నెత్తిన జిలకర బెల్లం పెట్టు, మంగళసూత్రం మెళ్లోన కట్టు, లక్షలు వోసి దావత్ వెట్టు, కొత్తగ వేరే కాపురమెట్టు, నీదేమో నైట్ షిఫ్టు, నీ వైఫుది మార్నింగ్ షిఫ్టు, వీకెండ్ లో రొమాన్స్ కు ప్లానింగ్ చేసి లెక్కలుగట్టు...' అంటూ ప్రస్తుత కాలంలో యూత్ మ్యారీడ్ లైఫ్ స్టైల్ ను చూపిస్తూ సాగుతుందీ పాట.విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
'సంతాన ప్రాప్తిరస్తు' నుంచి 'తెలుసా నీ కోసమే' సాంగ్ లాంచ్
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. నవంబర్ 14న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సోమవారం సినిమాలోని ఓ పాట లాంచ్ చేశారు. తెలుసా నీ కోసమే అంటూ సాగే లిరికల్ గీతాన్ని అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ సురేష్ బాబు రిలీజ్ చేశారు. 'ఆయ్', 'సేవ్ ది టైగర్స్' లాంటి సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ.. ఈ గీతాన్ని కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునే పాడారు. -
సింగర్‌గా మారిన వెన్నెల కిశోర్.. పాటతోనూ నవ్వించేశాడు!
స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సింగర్ గా మారారు. ఇన్నాళ్లు తన హావభావాలతో అలరించిన ఈ కమెడియన్..ఇకపై తన గాత్రంతోనూ ఆకట్టుకోనున్నాడు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో 'అనుకుందొకటిలే..'అనే పాటను ఆయన ఆలపించాడు. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాత్ర నేపథ్యంగా 'అనుకుందొకటిలే..' పాటను ఆకట్టుకునేలా రూపొందించారు.'అనుకుందొకటిలే..' పాట ఎలా ఉందో చూస్తే - అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే,అయిపోలేదులే, గేరే మార్చులే, భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే, కళ్లే మూసుకో, నన్నే నమ్ముకో.. అంటూ వినోదాత్మకంగా సాగుతుందీ పాట. ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేయగా, బాలవర్థన్ లిరిక్స్ అందించారు. వెన్నెల కిషోర్ ప్రొఫెషనల్ సింగర్ లా పాడి ఆకట్టుకున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.


