విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu Trailer). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చెప్పినమాట విననివాడే కొడుకు.. చెప్పినమాట విన్నట్లు నటించేవాళ్లే కూతురు.. అంతే పెద్దా తేడా లేదు... అనే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. ప్రేమ పెళ్లి తర్వాత పిల్లల కోసం మన హీరో ఎన్ని కష్టాలు పడ్డారనేదే సంతాన ప్రాప్తిరస్తు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. ఈ చిత్రాన్ని పిల్లల దినోత్సవం కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు.


