కొందరు సెలబ్రిటీలు మైక్ పట్టుకుంటే నోరు అదుపులో ఉండదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తుంటారు. తాము చెప్పదలుచుకున్నది మంచి విషయమే కావొచ్చు. కానీ ఎలా చెబుతున్నమనేది కూడా ముఖ్యమే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నటుడు శివాజీ.. సోమవారం జరిగిన 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మరీ ముఖ్యంగా రెండు బూతు పదాల్ని స్టేజీపై బహిరంగంగా అనడం చర్చనీయాంశమైంది. స్పందించిన సింగర్ చిన్మయి.. ఆగ్రహంతో ట్వీట్ చేసింది.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
శివాజి ఏమన్నాడంటే?
'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు' అని శివాజీ అన్నాడు. అయితే ఇందులో ఓ బూతు పదంతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకునే సామాను అనే చిల్లర పదం ఉపయోగించడం ఇక్కడ వివాదాస్పదమైంది.
సింగర్ చిన్మయి రెస్పాన్స్
శివాజీ పబ్లిక్‌గా స్టేజీపై చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించింది. 'తెలుగు నటుడు శివాజీ.. బూతు పదాలతో హీరోయిన్లకు అనవసర సలహా ఇచ్చాడు. ఆయా పదాల్ని ఎక్కువగా పోకిరీలు ఉపయోగిస్తారు. ఓ అద్భుతమైన సినిమాలో శివాజీ విలన్‌గా నటించాడు. తద్వారా పోకిరీలకు హీరో అయిపోయాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పబ్లిక్‌గా ఇలాంటి పదాలు వాడటం. ఆయనేమో జీన్స్, హూడీ వేసుకున్నాడు. మరి ఆయన చెప్పిన దానిబట్టి చూస్తే ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలిగా. ఒకవేళ ఆయనకు పెళ్లయి ఉంటే బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి. అసలు మహిళలని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది' అని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది.
(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)


