'ధురంధర్' సినిమాని పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో తీశారు. 1990ల్లో అక్కడ జరిగిన గ్యాంగ్ వార్స్‌కి ఓ కల్పిత కథ జోడించి దర్శకుడు ఆదిత్య ధర్ ఈ మూవీ తెరకెక్కించాడు. ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఉంది. అయితే వసూళ్లలో తమకు షేర్ ఇవ్వాలని ఇప్పుడు లయరీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?)
ఈ వీడియోలో లయరీకి చెందిన పలువురు వ్యక్తులు మాట్లాడారు. తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించారు కాబట్టి వసూళ్లలో ఎందుకు వాటా ఇవ్వకూడదు? అని అన్నాడు. మరో వ్యక్తి అయితే ఏకంగా 80 శాతం కలెక్షన్స్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తం ఇవ్వడం వల్ల దర్శకుడికి పెద్దగా పోయేదేం ఉండదని, తర్వాత కూడా ఎలానూ సినిమాల చేస్తాడు కదా అని చెప్పుకొచ్చాడు.
మరో వ్యక్తి మాట్లాడుతూ.. 'ధురంధర్' వసూళ్లలో కనీసం సగానికి సగమైనా సరే లయరీ ప్రజలకు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరికొందరైతే రూ.5 కోట్లు, రూ.20 కోట్లు అని నోటికొచ్చినట్లు మొత్తాన్ని చెప్పారు. మరోవ్యక్తి మాత్రం కలెక్షన్స్‌లో కొంత మొత్తంతో ఆస్పత్రి కట్టించి ఇవ్వాలని అన్నాడు. ఇంకో వ్యక్తి అయితే ఒకవేళ దర్శకుడు ఇవ్వాలనుకున్నా సరే తమకు ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి ఉండదని తమ ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పాడు.
(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?)
ఈ సినిమాని పాకిస్థాన్‌లో బ్యాన్ చేశారు. అయినా సరే అక్కడి ప్రజలు పైరసీ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. అలా ఏకంగా 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలోని పాటలకు రీల్స్ చేస్తూ, పెళ్లిళ్లలో వీటినే ప్లే చేస్తూ పాక్ ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా దాయాది దేశంలోనూ ఈ మూవీ హాట్ టాపిక్ అయిపోయిందనే చెప్పొచ్చు.
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాని.. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తీశారు. మన దేశానికి చెందిన ఓ ఏజెంట్.. రహస్యంగా పాక్ వెళ్లి అక్కడి గ్యాంగ్‌లో చేరి వాళ్లనే ఎలా తుదముట్టించాడు అనే కాన్సెప్ట్‌తో తీశారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్స్ ఇందులో యాక్టింగ్ అదరగొట్టేశారు. మ్యూజిక్, సాంగ్స్ కూడా సూపర్ ఉండటంతో సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి.
(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)
BREAKING: Pakistanis want @AdityaDharFilms to give Lyari a portion of Dhurandhar's profits
"Kam se kam yeh toh theek karwa lein"
🤣🤣🤣🤣 pic.twitter.com/djlvJrLaJi— Sensei Kraken Zero (@YearOfTheKraken) December 22, 2025


