ఎప్పుడో ఏదో కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యే తెలుగు నటుడు శివాజీ.. ఇప్పుడు హీరోయిన్లకు డ్రస్సింగ్ సెన్స్ గురించి సలహా ఇచ్చాడు. ఏ బట్టలు పడితే అవి వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే సలహా ఇవ్వడం బాగానే ఉంది కానీ వీటిలో మధ్యలో ఉపయోగించిన ఒకటి రెండు పదాలు మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించాయి.
గతంలో తెలుగులో హీరోగా, సహాయ నటుడిగా పలు సినిమాలు చేసిన శివాజీ.. చాన్నాళ్ల పాటు టాలీవుడ్‌లో కనిపించలేదు. 90స్ వెబ్ సిరీస్, కోర్ట్ సినిమాతో హిట్స్ అందుకుని ఇప్పుడు వరస మూవీస్ చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'దండోరా'. ఈ గురువారం (డిసెంబరు 25) థియేటర్లలోకి రానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగ్గా.. ఇందులోనే మాట్లాడుతూ హీరోయిన్లకు సలహా ఇచ్చాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)
'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. హీరోయిన్లు అందరూ ఏమనుకోవద్దు. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతారు గానీ.. దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని అనాలపిస్తుంది లోపల కానీ అనలేం. మళ్లీ అంటే స్త్రీ స్వాతంత్ర్యం లేదా స్వేచ్ఛ లేదా అంటారు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ.. చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనబడతా ఉంటుంది. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన వేషభాషల నుంచే గౌరవం పెరుగుతుంది' అని శివాజీ చెప్పుకొచ్చాడు.
ఈ మొత్తం స్పీచ్‌లో సామాను, దరిద్రపు ము** అనే పదాలు ఉపయోగించడం కాస్త అభ్యంతరకరంగా అనిపించింది. ఎందుకంటే సోషల్ మీడియాలో దీన్ని బూతు అర్థం వచ్చేలా మాట్లాడతారు. బయట ఎవరో దీన్ని అన్నారంటే ఏమోలే అనుకోవచ్చు గానీ పబ్లిక్‌గా స్టేజీపై ఓ నటుడు ఈ పదాలు ఉపయోగించడం అవసరమా అనేది ఇక్కడ ప్రశ్న.
(ఇదీ చదవండి: పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్)


