'మహానటి' సహా తెలుగులో చాలా సినిమాలు చేసిన కీర్తి సురేశ్.. హిందీ, మలయాళ, తమిళంలోనూ హీరోయిన్‌గా బిజీగా ఉంది. గతేడాది ప్రియుడు ఆంటోనిని పెళ్లి చేసుకున్నప్పటికీ.. కెరీర్ పరంగా ఖాళీగా ఏం లేదు. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లిలో డ్యాన్సులేస్తూ ఫుల్ సందడి చేసింది. ఆ వీడియోని తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)
తన ఫ్రెండ్ పెళ్లికి భర్త ఆంటోనితో పాటు వచ్చిన కీర్తి సురేశ్.. ఈ వేడుకలోనే తన బ్లాక్‌బస్టర్ సాంగ్ 'చమ్కీలా అంగిలేసి'కి స్టెప్పులేసింది. నాని భార్య అంజన కూడా కీర్తితో కలిసి డ్యాన్స్ చేసింది. వీరిద్దరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
నాని-కీర్తి సురేశ్.. నేను లోకల్, దసరా సినిమాల్లో జంటగా నటించారు. ఈ మూవీస్ చేస్తున్న టైంలోనే నాని కుటుంబంతో కీర్తికి స్నేహం కుదిరింది. తర్వాత కూడా ఒకటి రెండు సందర్భాల్లో నాని ఫ్యామిలీని కలిసింది. ఇప్పుడు ఏకంగా నాని భార్యతో కలిసి స్టెప్పులేసింది.
(ఇదీ చదవండి: 'ధురంధర్'లో తమన్నా ఉండాల్సింది.. కానీ రిజెక్ట్ చేశారు)
Actress #KeerthySuresh dancing to Chamkeela Angeelesi from #Dasara at her friend’s wedding 💃pic.twitter.com/DheMV7Te2d
— Milagro Movies (@MilagroMovies) December 22, 2025


