ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయిన సినిమా 'ధురంధర్'. పాకిస్థాన్‌లోని గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ స్పై డ్రామాలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ లాంటి స్టార్స్ అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఈ మూవీలో తమన్నా కూడా నటించాల్సింది కానీ దర్శకుడు ఈమెని రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ బయటపెట్టాడు.
'ధురంధర్' చిత్రం పూర్తిస్తాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కినప్పటికీ.. 'షరారత్' అంటూ సాగే ఓ స్పెషల్ (ఐటమ్) సాంగ్ కూడా ఉంది. హీరో పాత్రకు పెళ్లి జరిగే టైంలో ఇది వస్తుంది. ఇందులో ఆయేషా ఖాన్, క్రిస్టల్ స్టెప్పులేశారు. ఈ పాట కోసం తొలుత తమన్నానే అనుకున్నామని కొరియోగ్రాఫర్ చెప్పాడు. 'నా మైండ్‌లో తమన్నా పేరు మాత్రమే ఉంది. ఆమె అయితేనే పాటకు నిండుదనం తీసుకొస్తుంది. సరైన న్యాయం చేస్తుందని ఆదిత్యకు చెప్పాను. కానీ ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. ఇది రెగ్యులర్ ఐటమ్ సాంగ్‌లా ఉండకూడదని చెప్పేశారు' అని విజయ్ గంగూలీ తెలిపాడు.
'సినిమా కథని డిస్టర్బ్ చేసేలా ఒక్క అంశం కూడా ఉండకూడదనేది ఆదిత్య ధర్ ఉద్దేశం. ఒకవేళ ఈ పాటలో తమన్నా ఉంటే అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది తప్ప స్టోరీపై ఉండదు. సినిమా నుంచి ప్రేక్షకులు పక్కదారి పట్టే అవకాశముంది. అలా ఒకరికి బదులు ఇద్దరు డ్యాన్సర్లని పెడదామని ఆదిత్య నన్ను ఒప్పించాడు. అలా ఆయేషా, క్రిస్టల్ వచ్చారు' అని విజయ్ చెప్పుకొచ్చాడు.
గతంలో జైలర్, స్త్రీ 2, రైడ్ 2 తదితర సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన తమన్నా.. మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. ఎంతల అంటే ఐటమ్ సాంగ్స్ అంటేనే ఈమె గుర్తొంచేంతలా. ఒకవేళ 'ధురంధర్'లో గనక ఐటమ్ సాంగ్ కోసం ఈమెని తీసుకుని ఉంటే.. కొరియోగ్రాఫర్ చెప్పినట్లు ప్రేక్షకుడి దృష్టి మారిపోయి ఉండేదేమో!


