breaking news
Dhandoraa Movie
-
ఊరి నేపథ్యం ‘దండోరా’.. ప్రేక్షకుల ఊహకు అందదు : డైరెక్టర్
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మురళీకాంత్ మాట్లాడుతూ– ‘‘సమాజంలోని అసమానతలపై కథ చెప్పాలనుకుని, నాకు ఎదురైన ఓ సంఘటన ఆధారంగా ‘దండోరా’ సినిమా కథ రాసుకున్నాను. ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత అతన్ని పూడ్చిపెట్టే వరకు జరిగే కథే ‘దండోరా’. ఈ సినిమా కథ ఓ ఊరి నేపథ్యంలో సాగుతుంది. ఓ వ్యక్తిని ఆ ఊర్లో ఎందుకు పూడ్చనివ్వడం లేదు? ఆ ఊరి సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరికింది? అన్నదే కథ. ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. బిందు మాధవి, మనిక, రాధ్య, మౌనిక... ఇలా వీరు చేసిన పాత్రలు, తీసుకునే నిర్ణయాలే టర్నింగ్ పాయింట్స్‌గా ఉంటాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందో ప్రేక్షకుల ఊహకు అందదు. ముందుగా ఈ మూవీ కోసం వేరే టైటిల్ అనుకున్నాను. ఇది నాకు మూడేళ్ల జర్నీ. ‘అంతిమ యాత్ర’ అనే వర్కింగ్ టైటిల్‌ను అందరూ చూసి డల్‌గా ఉందని అనుకున్నారు. మనం మంచి కథను, మంచి సౌండింగ్‌తో చెబుతున్నాం కదా.. టైటిల్ కూడా అంతే పవర్ ఫుల్‌గా ఉండాలని నిర్మాత అన్నారు. అలాంటి టైంలో ఓ ఫ్రెండ్ ‘దండోరా’ అని సలహా ఇచ్చారు. అలా ఈ మూవీకి కరెక్ట్ టైటిల్ దొరికినట్టు అయింది’ అన్నారు -
సామాజిక అసమానతలు ప్రశ్నించేలా 'దండోరా' టైటిల్ సాంగ్
'దండోరా' సినిమా టైటిల్ గీతాన్ని శనివారం విడుదల చేశారు. మార్క్ కె రాబిన్ సంగీతమందించాడు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల బాధలను తెలియజేసేలా సాగే ఈ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది. తరాలు మారుతున్నాయి. చంద్రుడిపైకి మనిషి అడుగు పెట్టిన ఎన్నో ఏళ్లవుతుంది. అయినా కూడా ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదనేది ఈ పాటలోని భావం.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)కలర్ ఫోటో, బెదురులంక 2012 సినిమాలని నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తీసింది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 23నే ప్రీమియర్స్ ఉండనున్నాయి.(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్) -
తెలంగాణ గ్రామీణ ప్రేమకథా చిత్రం.. లవ్ సాంగ్ వచ్చేసింది..!
రవికృష్ణ, మనికా చిక్కాల జంటగా నటిస్తోన్న చిత్రం దండోరా. ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ లిరికల్ వీడియో సాంగ్ ప్రేమికులను తెగ అలరిస్తోంది. ఈ పాటకు పూర్ణచారి లిరిక్స్ అందించగా.. ఆదితి భవరాజు, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ మూవీకి మార్క్ కె రాబిన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తెలంగాణ పల్లెలో చావు చుట్టూ జరిగే కథ.. టీజర్ రిలీజ్
రీసెంట్ టైంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ స్టోరీతో చాలా సినిమాలు వస్తున్నాయి. అలాంటి మరో మూవీ 'దండోరా'. శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ, నందు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం.. డిసెంబరు 25న థియేటర్లలోకి రానుంది. ఇప్పటినుంచే ప్రమోషన్ మొదలుపెట్టేశారు. అడివి శేష్ చేతుల మీదుగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఈవారం బిగ్ బాస్ నామినేషన్స్)తెలంగాణలోని ఓ పల్లెలో ఒకరు చనిపోతారు. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. గతంలో ఇలానే చావు చుట్టూ జరిగే కథతో 'బలగం' తీశారు. అది ఓవైపు కామెడీగా సాగుతూనే చివరలో ఎమోషనల్ చేసింది. 'దండోరా' మాత్రం సీరియస్ డ్రామాలా అనిపిస్తుంది. అలానే ఇందులో ప్రేమకథ, వేశ్య స్టోరీ, సర్పంచ్ స్టోరీ లాంటి ఉపకథలు కూడా కనిపించాయి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
నటిగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ సింగర్!
‘కలర్‌ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలతో అందరిని ఆకట్టుకున్న నిర్మాత రవీంద్ర బెనర్జీ..ఇప్పుడు మరో వైవిధ్యమైన ప్రేమకథని తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బలమైన ప్రేమ కథాంశంతో పాటు కఠినమైన నిజాలను, సమాజంలో కొనసాగుతోన్న సామాజిక దుష్పప్రవర్తలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు ప్రధాన పాత్రల్లో మెప్పించనున్నారు.ఇప్పుడు టాలెంటెడ్ సింగర్ అదితి భావరాజు నటిగా ఈ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్‌ను ఆలపించిన అదితి..‘దండోరా’ చిత్రంలో నటనా ప్రతిభను ప్రదర్శించనుంది. ఆమె ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.‘దండోరా’ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పలు కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన మూవీ ఫస్ట్ బీట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాబోయే రోజుల్లో సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. -
తెలంగాణ దండోరా
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక, అనూష, రాధ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైంది. 25 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో శివాజీ పాల్గొంటున్నారు. ‘‘అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతుందనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘దండోరా’ తీస్తున్నాం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే, హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’
శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా.. బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’ సినిమాను రూపొందించనున్నారు. మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.


