నటిగా ఎంట్రీ ఇస్తున్న స్టార్‌ సింగర్‌! | Singer Aditi Bhavaraju To Make Acting Debut With Loukya Entertainments Dhandoraa, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

‘దండోరా’తో నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్‌!

Jun 1 2025 10:05 AM | Updated on Jun 1 2025 12:36 PM

Singer Aditi Bhavaraju To Make Acting Debut With Loukya Entertainments Dhandoraa

‘క‌ల‌ర్‌ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలతో అందరిని ఆకట్టుకున్న నిర్మాత రవీంద్ర బెనర్జీ..ఇప్పుడు మరో వైవిధ్యమైన ప్రేమకథని తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రానికి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బ‌ల‌మైన ప్రేమ క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప‌ప్ర‌వ‌ర్త‌ల‌ను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో శివాజీ, న‌వదీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య  త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.

ఇప్పుడు టాలెంటెడ్ సింగ‌ర్ అదితి భావ‌రాజు న‌టిగా ఈ చిత్రంతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌ను ఆల‌పించిన అదితి..‘దండోరా’ చిత్రంలో న‌టనా ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించ‌నుంది. ఆమె ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

‘దండోరా’ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తెలంగాణ‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప‌లు కీల‌క షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ ఫ‌స్ట్ బీట్ టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. రాబోయే రోజుల్లో సినిమా నుంచి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విశేషాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement