అనుపమకు చేదు అనుభవం.. షూటింగ్‌ టైంలో టీనేజర్ దాడి..! | Anupama Faces bad Incident with teenager During in Shooting | Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: అనుపమకు షూటింగ్‌ టైంలో చేదు అనుభవం

Nov 29 2026 9:57 PM | Updated on Nov 29 2026 10:01 PM

Anupama Faces bad Incident with teenager During in Shooting

నటి అనుపమ పరమేశ్వరన్‌కు షూటింగ్‌ టైంలో చేదు అనుభవం ఎదురైంది. ఓ పాఠశాలలో షూటింగ్‌ చూస్తుండగా.. ఓ టీనేజర్‌ ఇ‍బ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అనుపమ సోషల్‌ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెడుతూ..అసహనం వ్యక్తం చేశారు.

‘ఓ పాఠశాలలో షూటింగ్‌ జరుగుతుండగా.. ఓ టీనేజర్‌ ఉద్దేశపూర్వకంగానే నన్ను గుచ్చాడు. ఆ తర్వాత రెండు పుస్తకాలను కోపంగా విసిరాడు. ఇదే విషయాన్ని వీడియోలో కూడా చూశాం. అది కేవలం ఓ పుస్తకమే కావొచ్చు.. కానీ ఈ ఘటన నన్ను ఎంతో ఆలోచించేలా చేసింది. నటన అనేది ఓ గొప్ప వృత్తి. ఇలా ప్రేక్షకులు చూపించే ప్రేమ, అభిమానానాకి ఎప్పుడూ రుణపడి ఉంటా.  

గుర్తుంచుకోండి..
అయితే కొన్ని సార్లు ఆ అభిమానం వల్ల నాకు ఎదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భావన కలుగుతోంది. సెలబ్రెటీ కాబట్టి వారితో ఎలా ప్రవర్తించినా పర్వాలేదులే అని అనుకుంటున్నారు. దాని వల్ల ఎదుటివారికి ఎంత బాధ కలుగుతుందనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ మనుషులేనని గుర్తుంచుకోండి. నటీనటులు కూడా సాధారణ వ్యక్తులే. నటులుగా కాకుండా మనుషులుగా వారిని గౌరవించండి.  ఇలా ఇప్పుడు నా మీద దాడి చేసినట్లు తెలియని వ్యక్తిపై చేయలేరు కదా!  ఒకరిని బాధపెట్టే హక్కు ఎవరికీ లేదు’ అని అనుపమ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూర్య ‘సీన్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement