దుల్కర్‌ కోసం మెగా హీరోలు.. వీడియో వైరల్‌ | Megastar Chiranjeev Ram Charan Appreciate Team Aakasam Lo Oka Tara | Sakshi
Sakshi News home page

Aakasamlo Oka Tara: దుల్కర్‌ సినిమా.. మెగా హీరోల ప్రశంసల వర్షం..

Nov 29 2026 8:01 PM | Updated on Nov 29 2026 8:04 PM

Megastar Chiranjeev Ram Charan Appreciate Team Aakasam Lo Oka Tara

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా పవన్‌ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిత్రంపై ప్రశంసలు కురిపించగా.. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ చిత్రబృందాన్ని నేరుగా కలిసి అభినందించారు.

ఇటీవల ఎక్స్‌ వేదికగా చిరంజీవి ఈ సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి చిత్రబృందాన్ని కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ కూడా ఆయనతో పాటు ఉన్నారు. దుల్కర్‌కు ప్రత్యేకంగా అభినందించారు. చిత్రబృందంతో కొద్దిసేపు ముచ్చటించి సినిమా విజయంపై ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

( ఇదీ చదవండి: ఓటీటీ ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చిన ‘రామాయణం’)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement