12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. అనిల్ రావిపూడి సినిమాతోనే.. ? | abbas telugu comeback anil ravipudi january 12 vidudhala movie | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్‌

Nov 29 2026 6:24 PM | Updated on Nov 29 2026 6:24 PM

abbas telugu comeback anil ravipudi january 12 vidudhala movie

అబ్బాస్.. ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చే సినిమా ‘ప్రేమదేశం’. ఆ చిత్రంతో అప్పట్లో యువత కలల రాకుమారుడిగా మారిపోయారు ఆయన. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే వరుస విజయాలు అందుకున్న అబ్బాస్.. ఆ తర్వాత వరుస పరాజయాలతో సినిమాలకు దూరమయ్యారు.

జనవరి 12 విడుదల’లో
అయితే ఇప్పుడు ఈ హీరో మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన ‘హ్యాపీ రాజ్’ సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తెలుగులోనూ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రమైన ‘జనవరి 12 విడుదల’లో అబ్బాస్ కీలక పాత్ర పోషించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కాగా వెంకటేశ్‌, కల్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి: నాని.. నన్ను దేవుడిలా ఆదుకున్నాడు: నితిన్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement