హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’. నాని నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆఫియా సయీద్ కథానాయికగా నటిస్తోంది. డిసెంబరు 04న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నానితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
నాని దేవుడిలా వచ్చాడు
ఈ వేడుకలో నితిన్ మాట్లాడిన మాటలు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. ‘నేను చాలా కష్టాల్లో ఉన్న సమయంలో నాని దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు. నేను ఆఫీసులో ఉన్నప్పుడు అద్భుతమైన కథతో నా దగ్గరకు వచ్చాడు. నాకే తమ్ముడు ఉంటే కొట్టిమరీ సినిమా చేయించేవాడిని అని నాతో అన్నాడు. ఆ తర్వాత కథ విన్నాను. నిజంగా అద్భుతంగా అనిపించింది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. కష్టాల్లో ఉన్న సమయంలో బంగారు పళ్లెం చేతిలో పెట్టినట్లుగా నాని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్నాను’ అని నితిన్ తెలిపారు. అనంతరం వేదికపైకి నానిని ఆహ్వానించి ఆత్మీయంగా హత్తుకున్నారు. ప్రస్తుతం నితిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
(ఇదీ చదవండి: భర్త అంటే ఆయనలా ఉండాలి: రేణు దేశాయ్)
నేను చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక దేవుడిలా మా #Nani బాబు వచ్చాడు – Nithiin at #AliasRukmini Pre Release Event https://t.co/e0NfHz3S03
— cinee worldd (@Cinee_Worldd) November 28, 2026


