చాలామంది స్టూడెంట్స్‌కి హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ లేదా స్టాన్‌ఫోర్డ్ నుంచి డిగ్రీ పొందడం అతిపెద్ద మైలురాయి. కానీ ఈ వ్యక్తి అలాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లోనే చాలా డిగ్రీలు చదివాడు. అంతేగాదు ఒక పక్క స్టార్టప్‌గా రాణిస్తూనే అలాంటి టాప్ యూనివర్సిటీలో పదికిపైగా డిగ్రీలు పూర్తి చేశాడు. ఎవరా అసామాన్య వ్యక్తి అంటే..
న్యూజిలాండ్‌కు చెందిన 31 ఏళ్ల జేమి బీటన్ పదికి పైగా డిగ్రీలు చేశాడు. అది కూడా ప్రతిష్టాత్మకమైన అగ్రశ్రేణి యూనివర్సిటీల్లోనే చేశాడు. వాటిలో చాలామటుకు కళాశాలకు హజరవ్వగా మిగతావన్ని రిమోట్‌గా చదువుకున్నారడు. వాటిలో ఎక్కువ న్యాయశాస్త్రం, ప్రజావిధానం, జర్నలిజం. వంటి వాటిల్లో డిగ్రీలు చేశాడు. అది కూడా 31 ఏళ్ల వయసుకే ఏకంగా 13 డిగ్రీలు పూర్తి చేశాడు. బీటన్ 2016లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీచ మాస్టర్ డిగ్రీలలో పట్టభద్రుడయ్యాడు.
ఆ తర్వాత అతను స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబిఏ, యేల్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో డాక్టరేట్ పొందాడు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో రోడ్స్ స్కాలర్‌గా ప్రజా విధానాన్ని అభ్యసించాడు. ఇవేగాక పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం, కార్నెల్ విశ్వవిద్యాలయం, డార్ట్‌మౌత్ కాలేజ్, కింగ్స్ కాలేజ్ లండన్, బీజింగ్‌లో సింఘువా విశ్వవిద్యాలయంలలో కూడా కొన్ని కోర్సులు చదివాడు.
ఇవన్నీ చదువుతూనే వ్యాపారం కూడా చేశాడు. 2013లో షార్ండ్రే కుషోర్, ఫాంగ్‌జౌ జియాంగ్‌లతో కలిసి క్రిమ్సన్ ఎడ్యుకేషన్‌ను సహ-స్థాపించాడు. ఈ సంస్థ ఐవీ లీగ్ సంస్థలతో సహా ప్రముఖ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవడంలో విద్యార్థులకు సహాయపడుతుంది. తన మొదటి ఐదు డిగ్రీలు ఎక్కువగా తన స్టార్టప్ అవసరాలకు సంబంధించినవి కాగా, మిగతావన్ని తన ఇష్టం అభిరుచితో చేసిన డిగ్రీలు. వాటిల్లో ఆరోగ్య సంరక్షణ, సైనిక వ్యూహాంకు సంబంధించిన డిగ్రీలు కూడా ఉన్నాయి.
తనకు ఇలా ఇన్ని డిగ్రీలు పూర్తి చేయాలన్న లక్ష్యం లేదని, కేవలం వివిధ కోర్సులు అభ్యసించాలనే ఆసక్తి మాత్రం అపారంగా ఉందని చెబుతున్నాడు బీటన్. తనకు విద్యపట్ల ఆసక్తి తన తల్లి వల్లనే వచ్చిందని చెబుతున్నాడు. తన తల్లి పౌలా విద్యకు అధిక ప్రాముఖ్యత ఇచ్చేదని, తన విద్యాభాసాన్ని బాగా ప్రోత్సహించింది ఆమేనని చెప్పుకొచ్చాడు.
ఇలా వివిధ కోర్సులు చదవడంని తన తల్లి త్యాగంగా పేర్కొనదని..జ్ఞానసముపార్జన కోసం చేస్తున్నదిగా భావిస్తుందని అన్నాడు. ఇక బీటన్ ప్రస్తుతం బ్రౌన్ విశ్వవిద్యాలయంలో డేటా సైన్స్ చదువుతున్నాడు. తాను ఎన్ని అర్హతలు సంపాదించాలనే దానిపై అతను ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదని, ఆసక్తి ఉన్నతం కాలం చదువు కొనసాగిస్తానని అన్నాడు.
ఇదీ చదవండి: పిల్లలను జీవితానికి సిద్ధం చేయండి..!: హర్ష్ గోయెంకా పేరెంటింగ్ టిప్స్


