కోట్లు ఆర్జించే ఉద్యోగాన్ని కాదని వ్యాపారం చేయాలని రిస్క్ తీసుకుంది. అది కూడా తను ఎదుర్కోన్న అనారోగ్య సమస్యలే మొక్కల ఆధారిత పాలతో స్టార్టప్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు దారితీసింది. అది కాస్తా ఇవాళ కోట్లు టర్నోవర్ ఆర్జించి..యువ రైతులకు ఆదర్శంగా నిలిచేలా చేసింది. మరి ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందామా..
ఆ మహిళే ఆరోహి సూర్య. లక్నోలో జన్మించిన ఆరోహి తన ఇంజనీరింగ్ డిగ్రీ కోసం జైపూర్‌కు వెళ్ళింది. ఆ తర్వాత ఆమె ఐఎమ్‌టి (IMT) కళాశాల నుంచి ఎంబీఏ (MBA) చేసేందుకు దుబాయ్‌కి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె ఏడేళ్లు కార్పొరేట్ రంగంలో పనిచేసింది. జూనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, మార్కెటింగ్ హెడ్ స్థాయికి ఎదిగింది ఎదిగారు. అప్పటికి, ఆమె ఏడాదికి సుమారు రూ. 1 కోటి సంపాదిస్తుండేది.
ఆ తర్వాత 2020లో, ఆమె 'యల్లా' అనే యాప్‌తో తన మొదటి స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, సోషల్ మీడియా ఫీచర్లను ఒకచోట చేర్చింది. వినియోగదారులు కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయవచ్చు, వంటకాలను సిఫార్సు చేయవచ్చు, వాటిని తమ కమ్యూనిటీతో పంచుకోవచ్చు. ఇక ఆ తర్వాత 2022లో, ఆరోహి భారతదేశానికి తిరిగి వచ్చారు. దాదాపు అదే సమయంలో, ఆమె తల్లికి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, అలాగే ఆమెను డాక్టర్ పాల ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉండమని సూచించారు.
ఇక ఆరోహి కూడా ఏళ్ల తరబడి కడుపు ఉబ్బరం, మొటిమలు, హార్మోన్ల గందరగోళంతో బాధపడ్డట్లు తెలిపింది. డాక్టర్లు, ఆమెను 'ఎక్కువ పాలు తాగండి' అని సూచించారు. ఆ క్రమంలోనే ఒక గ్లాసు పాలల్లో ఏమేమి ఉంటాయో తెలుసుకోవడం ప్రారంభించింది. అప్పుడే ఆమెకు తెలిసింది పాడి పరిశ్రమలో ఒక జంతువుని ఎలా చూసుకుంటారు, వాటిని హింసించేలా హార్మోన్ల వాడకం తదితరాల గురించి తెలుసుకుని..పాలను పూర్తిగా మానేసింది.
కానీ అలా పూర్తిగా తాగకుండా ఉండటం వల్ల కలిగే దుష్ప్రభావాల వల్ల..పాల రహిత పాలు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అలా వచ్చిందే ఓట్‌మిల్క్. ఇది ఆవుపాలకు ప్రత్యామ్నాయం. లాక్టోజ్ రహితమైనది, జీర్ణవ్యవస్థకు తేలికైనది కూడా. అలా ఆమె ‘డాన్సింగ్ కౌ’ అనుపేరుతో మొక్కల ఆదారిత పాల స్టార్టప్ బ్రాండ్‌ని ప్రారంభించింది. తన భర్త అన్మోల్ గోయల్‌తో 2022లో ప్రారంభించింది ఈ స్టార్టప్‌ని. తన వ్యక్తిగత పొదుపు రూ. 65 లక్షలను పెట్టుబడిగా పెట్టి మొదలుపెట్టింది.
ఆ ఓట్‌మిల్స్ ప్రజలు తమ రోజువారీ జీవితంలో సులభంగా ఉపయోగించుకునేలా తయారు చేసింది. అది సాధ్యమయ్యాక..ప్లాంట్-బేస్డ్ మిల్క్‌ను తయారు చేయగల ఫ్యాక్టరీల కోసం పూణే వెళ్తుండేది. తన ప్రొడక్టని అవుట్‌సోర్స్ చేయాలంటే..ఇలా చేయకతప్పదు. అలా తన తన ‘డాన్సింగ్ కౌ’ బ్రాండ్ అధికారికంగా 2023లో రెండు ఉత్పత్తులతో ప్రారంభమైంది. ఒకటి ఓటిష్ ఎక్స్ ట్రా క్రీమీ ఓట్‌మిల్స్..దీన్ని టీ, కాఫీ, డెజర్ట్‌లలో ఉపయోగించవచ్చు. రెండోది ఓటిష్ రిచ్ చాక్లెట్ మిల్క్, ఇది తక్షణమే తాగడానికి వీలైన పానీయం.
మొదట్లో ఉచితంగా కేఫ్‌లు అందించి చూశారు. ఆ తర్వాత ఆ కేఫ్‌లే తమ కస్టమర్లుగా మారినట్లు వెల్లడించింది ఆరోహి. ఇందులో అదనపు చక్కెర ఉండదు, కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా సులభంగా జీర్ణమవుతుంది, విటమిన్ బీ12కు మూలం. అమ్ముడైన ప్రతి 10,000 ఓట్ మిల్క్ కార్టన్‌లకు ఒక జంతువుని కాపాడగలుగుతున్నామని కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ తన వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు, రిటైల్ స్టోర్‌ల ద్వారా దాదాపు 30 వేల కస్టమర్లకు చేరుకుంది.
భారత్‌లో దాదాపు 500కు పైగా కేఫ్‌లు, రెస్టారెంట్లు, కాపీలు, టీలు, డెజర్ట్ కోసం నేరుగా ఈ కంపెనీ నుంచే ఓట్‌మీల్‌ని కొనుగోలు చేస్తున్నాయని ఆరోహి చెబుతోంది. అలా ఈ కంపెనీకి సుమారు 1.25 లక్షల వినియోగదారులు పెరిగారు. ఆ విధంగా ఈ కంపెనీ 2025లో సుమారు రూ. 2.2 కోట్ల వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది 2026 ఆర్థిక సంవత్సరానికి సుమారు 4.8 కోట్లు ఆర్జించగలగదని అంచనా..!.
ఇదీ చదవండి: ఆ ఒక్క కొబ్బరికాయ రూ. 2.55 లక్షలా..?! ఎందుకో తెలుసా..


