థింక్ డిఫరెంట్ అనే ట్యాగ్‌లైన్ చాలామంది ఔత్సాహికులకు ప్రేరణనిస్తుంది. దిల్ ఉన్నోడు దునియాని ఏలతాడు అన్నట్టుగా అమెరికాలో అధిక వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, భారతదేశంలో తయారీ రంగ వ్యాపారంలో అడుగు పెట్టిన పారిశ్రామికవేత్త ఆనంద్ బాలకృష్ణన్ సక్సెస్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. భారతదేశానికి చెందిన ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ 'టాప్‌సెయిల్' (Topsail) ప్రకాష్ దద్లానీ లింక్డ్‌ఇన్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆనంద్ బాలకృష్ణన్‌కు OEM, ODM, దిగుమతులు, ఎగుమతుల రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందని తన సంస్థ 'టాప్‌సెయిల్', పారిశ్రామికవేత్త ఆనంద్ బాలకృష్ణన్‌తో కలిసి ఈ ఉత్పత్తిని డిజైన్ దశ నుండి తయారీ దశకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తోందని వెల్లడించారు. ఆనంద్ ఈ ఉత్పత్తిని పరీక్షించిన తర్వాత, మార్కెట్ నుండి చాలా మంచి స్పందన లభించిందని, మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయిందని ఆయన పేర్కొన్నారు. బిల్డ్ ఇన్ భారత్‌లో భాగంగా దేశంలో ఉత్పత్తిని ప్రారంభించడమే తదుపరి పెద్ద అడుగు అని పేర్కొన్నారు.
ఉత్పత్తి ఆలోచన నుండి తయారీ వరకు
ఒక ఉత్పత్తిని మొదటి నుండి నిర్మించాలంటే కేవలం మంచి ఆలోచన ఉంటే సరిపోదు. ఉత్పత్తికి సిద్ధమయ్యే ముందు డిజైన్, సరైన విడిభాగాల సేకరణ, పరీక్షలు మరియు అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది. అమెరికా నుండి భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆనంద్ ఈ ప్రక్రియను పూర్తి చేశారు. తన ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఉపయోగించి, భారతీయ మార్కెట్లో లోటు ఉందని భావించిన ఒక ఉత్పత్తిని ఆయన డిజైన్ చేశారు. ఇండస్ట్రియల్ డిజైనర్లతో కలిసి పనిచేయడమే కాకుండా, విడిభాగాలను స్వయంగా సేకరించి ఉత్పత్తిలో అనేక మార్పులు చేశారు.
టూలింగ్ (tooling) దశలో టాప్ సెయిల్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైందని, తయారీకి ఉత్పత్తిని సిద్ధం చేయడానికి ఆనంద్‌తో కలిసి పనిచేసిందని దద్లానీ చెప్పారు. "మౌల్డ్స్‌ను అభివృద్ధి చేసి ఉత్పత్తికి సిద్ధం చేయడానికి చైనాలోని మా తయారీ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ, టూలింగ్ దశ నుండి మేము ఆనంద్‌తో కలిసి పనిచేశాంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.
He left a high-paying job in the US and came back to India to build a manufacturing business. He had an idea for a product that didn't exist in the Indian market. 1. Used his engineering skills to design it. 2. Worked with industrial designers. 3. Sourced the components himself. 4. Went through multiple iterations. And that's where Topsail came in. We worked alongside Anand from the tooling stage, coordinating with our manufacturing partners in China to get the moulds developed and ready for production. The tools are now DONE. I visited the mould trials myself. The parts came out fabulous. 🔥 Next stop: TOPSAIL. We're bringing the tools to India and starting production here. The best part? Anand has already tested the market. The first batch is already SOLD OUT. We need more people like Anand who don't just talk about making India a manufacturing hub. They actually build. And at Topsail, we're here to help them make it happen. From product design and tooling to manufacturing and production. BUILD IN BHARAT 🇮🇳 @anandbalakrish | https://t.co/VPhNrMVkj6
— Prakash Dadlani (@prakdadlani) November 16, 2026
సిద్ధమైన మౌల్డ్స్, భారత్‌లో ప్రారంభం కానున్న ఉత్పత్తి
మౌల్డ్ అభివృద్ధి ప్రక్రియ ఇప్పుడు పూర్తయింది, ఇది స్థానికంగా ఉత్పత్తిని తయారు చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. విడిభాగాలను తనిఖీ చేయడానికి తాను స్వయంగా మౌల్డ్ ట్రయల్స్‌ను సందర్శించానని, ఫలితాల పట్ల సంతోషంగా ఉన్నానని దద్లానీ తెలిపారు. తదుపరి దశలో ఈ మౌల్డ్స్‌ను భారత్‌కు తీసుకువచ్చి టాప్‌సెయిల్‌లో ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. చైనాలోని తయారీ భాగస్వాములతో ప్రాథమిక టూలింగ్ పని పూర్తయిన తర్వాత, ఇది ప్రాజెక్ట్‌ను దేశీయ తయారీకి మరింత దగ్గర చేస్తుంది. ప్రొడక్ట్ డిజైన్ అండ్ టూలింగ్ నుండి తయారీ వరకు టాప్‌సెయిల్ ఆనంద్‌కు అండగా నిలుస్తోందన్నారు
తొలి బ్యాచ్ సోల్డ్ అవుట్
ఈ పరిణామంలో మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆనంద్ ఇప్పటికే మార్కెట్‌ను పరీక్షించారు మరియు మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైంది. భారత్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభం కాకముందే ఇది ఈ వెంచర్‌కు ప్రోత్సాహకరమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఉత్పత్తిపై వినియోగదారులలో ప్రాథమిక ఆసక్తి ఉందని కూడా ఇది సూచిస్తోంది. దద్లానీ తన పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, "అన్నింటికంటే ముఖ్య విషయం ఏమిటంటే? ఆనంద్ ఇప్పటికే మార్కెట్‌ను పరీక్షించారు. తొలి బ్యాచ్ ఇప్పటికే అమ్ముడైంది (SOLD OUT)," అని తెలిపారు. అమెరికాలో మంచి వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు తిరిగి వచ్చి వ్యాపారాన్ని నిర్మించాలన్న ఆనంద్ నిర్ణయాన్ని దద్లానీ ప్రశంసించారు.
ఇదీ చదవండి: పెహల్గాం దాడి : రూ. 4 కోట్లు పోగొట్టుకున్న న్యూయార్క్ రిటైర్డ్ లాయర్
మరొక లింక్డ్ఇన్ పోస్ట్‌లో, భారత్‌కు తిరిగి వచ్చి సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకునే నిర్మించాలని కలలు కనే ప్రతి ఎన్నారైకి (NRIs) ఆనంద్ ఒక స్ఫూర్తి అని దద్లానీ అభివర్ణించారు. భారతదేశ తయారీ సామర్థ్యం గురించి కేవలం మాట్లాడటమే కాకుండా, రిస్క్ తీసుకుని తన సొంత డబ్బు, శ్రమను పెట్టి వ్యాపారాన్ని నిర్మిస్తున్నారని ఆయన కొనియాడారు. 'బైట్‌చెఫ్' (ByteChef) తయారీ భాగస్వామిగా ఉండటం పట్ల దద్లానీ గర్వం వ్యక్తం చేస్తూ, భారతదేశానికి ఆనంద్ వంటి వారు మరింతమంది అవసరమని అన్నారు. ప్రొడక్ట్ డిజైన్, టూలింగ్, తయారీ మరియు ఉత్పత్తి అంతటా మద్దతును అందిస్తూ, ఈ ప్రయాణంలో పారిశ్రామికవేత్తలకు సహాయం చేయాలని టాప్‌సెయిల్ కోరుకుంటున్నట్లు దద్లానీ తెలిపారు. 'బిల్డ్ ఇన్ భారత్' భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చడం గురించి కేవలం మాట్లాడే వారు కాకుండా, ఆనంద్ వంటి వ్యక్తులు మనకు మరింత మంది కావాలని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: నో ఐఐటీ ట్యాగ్ : ఆంత్రోపిక్ సీటీఓగా రాహుల్ సక్సెస్ స్టోరీ


