దేశంలో వాయు కాలుష్యానికి నాదే బాధ్యత: గడ్కరీ | Nitin Gadkari Pollution Confession Why India Must Move Beyond Petrol Diesel | Sakshi
Sakshi News home page

దేశంలో వాయు కాలుష్యానికి నాదే బాధ్యత: గడ్కరీ

Nov 17 2026 7:47 PM | Updated on Nov 17 2026 8:11 PM

Nitin Gadkari Pollution Confession Why India Must Move Beyond Petrol Diesel

పెట్రోల్‌, డీజిల్‌కు ప్రత్యామ్నాయాలే భవిష్యత్తు!

దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి రవాణా రంగం కూడా ప్రధాన కారణమని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అంగీకరించారు. రహదారుల అభివృద్ధి, వాహనాల సంఖ్య పెరుగుదల, పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం కారణంగా పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. దేశంలో వాయు కాలుష్యంలో 40 శాతానికి తాను బాధ్యత వహిస్తున్నానని పేర్కొంటూ.. రవాణా రంగంలో వస్తున్న మార్పులకు ప్రభుత్వ విధాన నిర్ణేతగా తనకూ బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన 14వ సీఐఐ బయోఎనర్జీ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నప్పటికీ దాని పర్యావరణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని గడ్కరీ అభిప్రాయపడ్డారు. మెరుగైన రహదారులు అందుబాటులోకి రావడంతో వాహనాల కొనుగోళ్లు పెరుగుతున్నాయని, వాటి వినియోగం ద్వారా వెలువడే ఉద్గారాలు కాలుష్యాన్ని తీవ్రతరం చేస్తున్నాయని వివరించారు. తన మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశ ఆటోమొబైల్‌ పరిశ్రమ విలువ రూ.14 లక్షల కోట్లుగా ఉండగా ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రపంచంలో ఏడో స్థానంలో ఉన్న భారత ఆటోమొబైల్‌ పరిశ్రమ మూడో స్థానానికి ఎదిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఇథనాల్‌, మిథనాల్‌, బయోడీజిల్‌, హైడ్రోజన్‌, విద్యుత్‌ ఆధారిత రవాణా వంటి మార్గాలు దేశానికి పర్యావరణ పరిరక్షణతోపాటు ఇంధన భద్రతను అందించగలవని వివరించారు.

వ్యర్థాల నుంచి ఇంధనం

ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తిలో వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, సేంద్రియ వ్యర్థాల వినియోగానికి గడ్కరీ ప్రాధాన్యం ఇచ్చారు. వీటి ద్వారా బయోఎనర్జీ, కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) ఉత్పత్తిని విస్తరించవచ్చని వివరించారు. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఇంధన తయారీకి వినియోగిస్తే రైతులకు అదనపు ఆదాయం లభించడంతోపాటు పంట అవశేషాల దహనం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నది ఈ విధానం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన.

ఇదీ చదవండి: తండ్రికి నోటీసులు పంపిన కూతురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement