సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఛత్ పూజ వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, ఢిల్లీలోని యమునా నది కాలుష్యం బీజేపీ, ఆప్ మధ్య రాజకీయ దుమారాన్నిరేపింది. సోమవారం ఛత్ పూజ వేడుకల కోసం భక్తులు ఢిల్లీలోని యమునా నదికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంఫేక్ వీడియోలతో భక్తులను మోసం చేసిందని ఆప్ ఆరోపించింది. మరోవైపు కాలుష్య నురుగులు మధ్య భక్తులు పూజాదికాలు నిర్వహించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
యమునా నదిలో నురుగుతో నిండిన నీటి వీడియోను షేర్ చేస్తూ, నదిని శుభ్రం చేశామని బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందని, కానీ భక్తులు కలుషితమైన నీటిలోనే పూజలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆప్ ఆరోపణలు గుప్పించింది.
"We worship rivers" got to be the biggest joke. 🤦♂️ Devotees are literally standing in foam for Chhath in Yamuna river. Place your bets on the BJP damage control excuse today: 1. Fake AI video 2. Opposition threw Surf in it 3. Not Yamuna Pick your fighter. https://t.co/b084E0m6Wd
— D (@Deb_livnletliv) November 16, 2026
యమునా నదిని శుభ్రంగా, స్వచ్ఛంగా చేశామని బీజేపీ ప్రకటించుకున్న నేపథ్యంలో ఆప్ నేతలు బీజేపీపై ఆరోపణలు గుప్పించరాఉ. ‘‘బీజేపీ నేతలు కెమెరాల ముందుకొచ్చి యమునా నదిని శుభ్రం చేశామని అబద్ధాలు చెప్పారు. కానీ ఛట్ పర్వదినం రోజున భక్తులు మురికి నీటిలోనే పూజలు చేయాల్సి వస్తోంది" అని ముఖ్యమంత్రి రేఖా గుప్తాను టార్గెట్‌గా ఆప్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సాకేత్ గోఖలే కూడా నదికి సంబంధించిన దృశ్యాలను షేర్ చేస్తూ, కేంద్రం, ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. నగరం కాలుష్యంతో సతమతమవుతుంటే యమునను శుభ్రం చేశామని ఎలా చెప్పు కుంటోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అయితే, ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. దేశ రాజధాని అంతటా ఛఠ్ వేడుకల కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. మునక్ కాలువ వెంబడి 11 కిలోమీటర్ల పొడవైన ఘాట్‌తో సహా, 996 ప్రాంతాల్లో 1,482 ఛఠ్ ఘాట్‌లను ఏర్పాటు చేసి సిద్ధం చేసినట్లు రేఖా గుప్తా ప్రభుత్వం పేర్కొంది. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు యమునా నది 50 శాతానికి పైగా శుభ్రంగా ఉందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. గతంలో భక్తులు యమునా నదిలో ఛఠ్ పూజలు జరుపుకునే అవకాశం లేకుండా చేశారని, కానీ బీజేపీ పాలనలో పరిస్థితి మెరుగుపడిందని తెలిపింది.
All that was served up in the name of cleaning the Yamuna was lies. Today, devotees forced to celebrate Chhath in the toxic Yamuna are suffering the consequences of the BJP’s failure. https://t.co/Sh6i2AQeQo
— NehaJha (@NeehaJha) November 16, 2026
కాగా ఇటీవల యమునా నదిలోని సోనియా విహార్ ప్రాంతంలో వందలాది చేపలు తేలియాడుతూ కనిపించడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఛఠ్ పూజకు ముందు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే చనిపోయిన చేపలను నదిలో పడేశారని ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి పర్వేష్ వర్మ ఆరోపించారు. ఇందులో ఆప్ కార్యకర్తల ప్రమేయం ఉండవచ్చని, విచారణలో నిజాలు బయట పడతాయని మంత్రి ఎదురుదాడికి దిగారు. తదనంతరం, నీటిపారుదల , వరద నియంత్రణ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు వజీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. చేపల మరణానికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు. బీజేపీ ఆరోపణలను ఆప్ ఖండించింది. నది కలుషితమైన కోణంలో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. యమునా నదిపై, ముఖ్యంగా ఓఖ్లా బ్యారేజ్ , కళిందీ కుంజ్ పరివాహక ప్రాంతాలలో, కాలుష్య నురుగులపై ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.


