కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు సన్నాహాలు? | Preparations For A Union Cabinet Purge | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు సన్నాహాలు?

Nov 13 2026 11:22 AM | Updated on Nov 13 2026 11:34 AM

Preparations For A Union Cabinet Purge

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 18న మరోసారి కేంద్ర మంత్రి మండలి భేటీ కానుంది. ఈ నెల 23న మంత్రిమండలి విస్తరణకు ఛాన్స్ ఉంది. క్యాబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రులందరితో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చాలా ఖాళీలు ఉండగా.. మూడు శాఖల భారాన్ని ప్రహ్లాద్ జోషి, అశ్వినివైష్ణవ్ మోస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత విద్యాశాఖకు ఫుల్ టైమ్ మంత్రి కరువయ్యారు.

విద్యా శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషి మోస్తున్నారు. ఇప్పటికే జోషి దగ్గర ఆహార సరఫరా శాఖ,  రెన్యువబుల్ ఎనర్జీ శాఖలు ఉన్నాయి. మంత్రి అశ్వినివైష్ణవ్.. మూడు శాఖలు నిర్వహిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రాల ఎంపీలకీ మంత్రి వర్గ ప్రక్షాళనలో అవకాశం ఉంది. గతంలోనూ పూర్తి మంత్రి మండలి సమావేశం తరువాత ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు, రాబోయే ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఇవాళ (శుక్రవారం) ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని సమీక్షించడంతో పాటు, ఇంకా పూర్తి చేయాల్సిన పనులపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: ఢిల్లీలో డేంజర్‌ లెవల్‌కు పొల్యూషన్

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement