శాంతిభద్రతలపై అమిత్‌ షా సమీక్ష  | Home Minister Amit Shah reviews Capital law and order situation | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలపై అమిత్‌ షా సమీక్ష 

Nov 13 2026 3:21 AM | Updated on Nov 13 2026 3:21 AM

Home Minister Amit Shah reviews Capital law and order situation

మూడు వారాల వ్యవధిలో ఢిల్లీలో ఇది రెండో సమావేశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై హోం మంత్రి అమిత్‌ షా మరోసారి గురువారం సమీక్ష చేపట్టారు. భద్రతా సన్నద్ధతపై ఢిల్లీ పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మూడు వారాల వ్యవధిలో చేపట్టిన రెండో సమావేశమిది. మూడు గంటలపాటు కొనసాగిన ఈ భేటీలో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు, ఢిల్లీ సీనియర్‌ పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. 

అక్టోబర్‌ 24న జరిగిన సమీక్ష సమయంలో చర్చించని అనేక అంశాలను సమావేశంలో చర్చించామని ఓ అధికారి తెలిపారు. కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా చెక్‌పోస్ట్‌ వద్ద బుధవారం సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదుల కాల్పులు, ఘజియాబాద్‌లోని వసుంధర పోలీసు అవుట్‌పోస్ట్‌ వద్ద జరిగిన పేలుడు తదితర ఘటనల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యమేర్పడిందన్నారు. నిరసనలు, ఆందోళనల సమయాల్లో పోలీసుల సన్నద్ధత, నిఘా సమాచార సేకరణ, వివిధ విభాగాల మధ్య సమన్వయం వంటి అంశాలు చర్చకు వచ్చాయని ఆ అధికారి తెలిపారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement