రూ. 7కోట్లు కట్టండి : కేజ్రీవాల్‌కు, ఆయన కుమార్తెకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపు! | Pay Rs 7 Crore Arvind Kejriwal His Daughter Get Death Threat | Sakshi
Sakshi News home page

రూ. 7 కోట్లు కట్టండి : కేజ్రీవాల్‌కు, ఆయన కుమార్తెకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపు!

Nov 12 2026 2:35 PM | Updated on Nov 12 2026 2:43 PM

Pay Rs 7 Crore Arvind Kejriwal His Daughter Get Death Threat

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు వచ్చిన బెదిరింపులు  కలకలం  రేపుతున్నాయి. రూ. 7 కోట్లు  చెల్లించాలని లేదంటే కేజ్రీవాల్‌తో పాటు,ఆయన కుమార్తెపై వచ్చిన హత్యా బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరికొద్ది నెలల్లోనే  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి తెరపైకి వచ్చింది.

విదేశాలతో సంబంధాలు ఉన్న బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినని చెప్పిన   వ్యక్తి తనకు ఫోన్ కాల్,వాట్సాప్ మెసేజ్ పంపాడని తిలక్ నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఢిల్లీ పోలీసులకు తెలిపారు. నవంబర్ 6న పంజాబ్‌లోని మొహాలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, డబ్బులు చెల్లించకపోతే కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్‌ను కూడా చంపేస్తామని ఆ వ్యక్తి బెదిరించినట్లు సింగ్ పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన మొహాలీ పోలీసులు, దర్యాప్తు బాధ్యతలను సైబర్ క్రైమ్ విభాగం అధికారి సునీల్ కుమార్‌కు అప్పగించారు.

బెదిరింపులకు ఉపయోగించిన మొబైల్ నంబర్‌కు సంబంధించిన కాల్ రికార్డులు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) లాగ్‌లు  లొకేషన్ డేటాను పరిశీలిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. కేజ్రీవాల్ , ఆయన కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని జర్నైల్ సింగ్ కోరారు. ప్రస్తుతం పంజాబ్‌లో భగవంత్ మాన్ నేతృత్వంలో ఆప్ అధికారంలో ఉండగా, మరికొద్ది నెలల్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: 15 ఏళ్ల కొడుక్కి, రూ. 1.6 కోట్ల కారు గిప్ట్‌ : ఎందుకో తెలుసా?

లారెన్స్ బిష్ణోయ్ జైలు నుంచే మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ,విదేశాల్లో ఉన్న ఇతర నేరస్థులతో కలిసి, పలు రాష్ట్రాల్లోని స్థానిక షూటర్లు , రహస్య స్థావరాల సాయంతో ఈ సిండికేట్‌ను నడుపుతున్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గతంలోనే వెల్లడించింది.

ఇదీ చదవండి: 10 ఏళ్లలో అద్భుతం : క్యాన్సర్‌, అల్జీమర్స్‌ ఇక చరిత్రే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement