కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత | Kedarnath and Yamunotri Dhams to close for winter | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత

Nov 12 2026 2:29 PM | Updated on Nov 12 2026 2:29 PM

Kedarnath and Yamunotri Dhams to close for winter

ఈ ఏడాది 27.97 లక్షల మందికి పైగా సందర్శన

రుద్రప్రయాగ/ఉత్తరకాశీ: శీతాకాలం నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలను మూసేశారు. నిర్ణీత ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య బుధవారం ఉదయం 8:30 గంటలకు కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు, ఉదయం 10:28 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాలు మూసేశారు. అనంతరం, బాబా కేదార్‌ ఉత్సవ విగ్రహాన్ని ఉంచిన పల్లకీని ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించి, శీతాకాలపు నివాసమైన ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయానికి తరలించారు.

ఈ పల్లకీ బుధవారం రాత్రి రాంపూర్‌లో బస చేసి, నవంబర్‌ 12న గుప్తకాశీకి చేరుకుంటుంది. నవంబర్‌ 13న ఓంకారేశ్వర ఆలయానికి చేరుకుంటుంది. శీతాకాలపు ఆరు నెలల కాలంలో భక్తులు ఓంకారేశ్వర ఆలయంలో కేదారనాథుడిని దర్శించుకోవచ్చు. యమునా దేవి పల్లకీ, సాంప్రదాయ ఆచారాలు, జానపద సంగీతాల మధ్య యమునోత్రి నుంచి దేవి శీతాకాలపు నివాసం ఖర్సాలికి బయలుదేరింది.

మధ్యాహ్నం గ్రామానికి చేరుకున్న దేవికి గ్రామస్తులు భక్తులు ఘనస్వాగతం పలికారు. ఈ ఏడాది తీర్థయాత్ర సీజన్‌లో 19.13 లక్షల మందికి పైగా కేదార్‌నాథ్‌ను, 8.84 లక్షల మందికి పైగా యమునోత్రిని సందర్శించారు. భారీ హిమపాతం, విపరీతమైన చలి కారణంగా ప్రతి ఏటా శీతాకాలంలో చార్‌ధామ్‌ ఆలయాలను ఆరు నెలల పాటు మూసేసి, శీతాకాలపు పీఠాలకు తరలించి పూజలు నిర్వహిస్తారు.

ఇదీ చ‌ద‌వండి: శబరిమలలో ట్రాన్స్‌జెండర్లకు నో.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement