పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త తన 15 ఏళ్ల కుమారుడికి బీఎండబ్ల్యూ ఎం4(BMW M4 Competition) కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ఘటన కొనిచ్చిన ఘటనకు నెట్టింట సందడి చేస్తోంది. 9వ తరగతి చదువుతున్న తన కుమారుడు హాఫ్-ఇయర్లీ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరచడంతోసంతోషంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. గల్సీ ప్రాంతంలోని పరాజ్ గ్రామంలో ఈ ముచ్చట చర్చనీయాంశంగా మారింది.
బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లా, గాల్సి ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త షంసుద్దీన్ మిద్యా, తన 15 ఏళ్ల కుమారుడు మహమ్మద్ తల్హా (9వ తరగతి విద్యార్థి) పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే కోరుకున్న కారు కొనిస్తానని మాట ఇచ్చారట. అనుకున్నట్టుగానే రిజల్ట్స్ బాగా రావడంతో ఆయన తన మాట ప్రకారం కారును కొనుగోలు చేసినట్టు సమాచారం. అంతేకాదు షంసుద్దీన్ మిద్యా లగ్జరీ కార్ల కలెక్షన్ లిస్ట్ కూడా పెద్దదే.
మిద్యా ముంబైలోని అందేరి షోరూమ్‌లో ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసి, ప్రత్యేకం గల కంటైనర్‌లో నవంబర్ 6న తమ గ్రామానికి రప్పించారు. ఈ లగ్జరీ కారును చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
బీఎండబ్ల్యూ ఎం4 ఫీచర్లు
3.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ ఇన్-లైన్ 6-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 530 bhp పవర్ మరియు 650 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, xDrive (ఆల్-వీల్ డ్రైవ్). కేవలం 3.5 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 250 kmph.
ఈ కొత్త కారుతో పాటు ఆయన వద్ద ఇప్పటికే పలు విలాసవంతమైన కార్లున్నాయి. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ,వోల్వో XC90, మెర్సిడెస్-బెంజ్ C-క్లాస్ , మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx) హ్యుందాయ్ అల్కాజార్ లాంటి కార్లు అతని సొంతం.
సోషల్ మీడియా స్పందన
ఈ సంఘటనపై నెటిజన్లలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు కొడుకు కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించిన తండ్రిని ప్రశంసించగా, మరికొందరు పదిహేనేళ్ల టీనేజర్‌కి ఇంత హైస్పీడ్ స్పోర్ట్స్ కారును ఇవ్వడం సరైంది కాదనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.


