తాత ఆస్తిలో తండ్రి ఆధీనంలో ఉన్న వాటాపై కొడుక్కి ఎలాంటి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు | No Claim for Son on Father's Share of Grandfather Property: Supreme Court | Sakshi
Sakshi News home page

తాత ఆస్తిలో తండ్రి ఆధీనంలో ఉన్న వాటాపై కొడుక్కి ఎలాంటి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు

Nov 11 2026 4:00 AM | Updated on Nov 11 2026 4:00 AM

No Claim for Son on Father's Share of Grandfather Property: Supreme Court

తాత నుంచి తన తండ్రికి సంక్రమించిన ఆస్తిపై కొడుకు ఎలాంటి హక్కును లేదా వాటాను కోరలేడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తండ్రి జీవించి ఉన్న సమయంలో తాత ఆస్తిలో కొడుకు జన్మతః హక్కు అడగలేడని అత్యున్నత ధర్మాసనం తేల్చిచెప్పింది.

హిందూ వారసత్వ చట్టం  ప్రకారం.. ఒక హిందూ వ్యక్తి తన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందిన ఆస్తిపై సంపూర్ణ యాజమాన్య హక్కు కలిగి ఉంటాడని కోర్టు పేర్కొంది. సెక్షన్ 8 ప్రకారం తండ్రికి సంక్రమించిన ఆస్తిని ఆయన తన సొంత ఆస్తిగా భావించి ఇష్టానుసారం విక్రయించుకోవచ్చని, దీనిపై కుమారుడు న్యాయపరంగా ఎలాంటి క్లెయిమ్ చేయలేరని కోర్టు స్పష్టం చేసింది. 

  1997లో ఓ వ్యక్తి తన తండ్రి వద్ద ఉన్న తాత ఆస్తిలో తనకు వాటా కావాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది. హిందూ వ్యక్తి మృతి చెందిన తర్వాత ఆస్తుల పంపిణీకి సంబంధించి 1956 చట్టంలోని సెక్షన్ 8 ఒక స్వయంప్రతిపత్త నిబంధనగా పనిచేస్తుందని, దీని ప్రకారం తాత ఆస్తిని పొందిన తండ్రి ఆస్తిపై కొడుకులకు జన్మహక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement