సాక్షి, నూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. కుల్గామ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఉగ్రవాదుల కాల్పులను సీఆర్‌పీఎఫ్ జవాన్లు తిప్పికొడుతున్నారు. సీఆర్‌పీఎఫ్ క్యాంప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.


