Viral Video: మహిళా అధికారిణిపై రెచ్చిపోయిన ఐఏఎస్‌ | IAS Abused Woman Colleague In Meeting In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

Viral Video: మహిళా అధికారిణిపై రెచ్చిపోయిన ఐఏఎస్‌

Oct 16 2026 7:24 AM | Updated on Oct 16 2026 8:46 AM

IAS Abused Woman Colleague In Meeting In Jammu And Kashmir

మహిళా అధికారిపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అసభ్య పదజాలంతో దూషించిన ఘటన జమ్మూ కశ్మీర్‌లో కలకలం రేపింది. ‘నేనే నీ బాస్‌ను’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జమ్మూ కశ్మీర్ కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి కుమార్‌ రాజీవ్ రంజన్‌తో ఉపాధి విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మహిళా అధికారిణి బీనిష్ వానీ వాగ్వాదానికి దిగారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి సంబంధిత కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు నిర్వహించిన మిషన్ యువా సమీక్షా సమావేశంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రంజన్ తీవ్ర ఆగ్రహంతో బీనిష్ వానీపై అరుస్తూ ఆమెను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించినట్లు వినిపిస్తోంది. నేనే నీ బాస్‌నంటూ ఆయన అన్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ ఘటనపై స్పందించిన బీనిష్ వానీ.. ఆ వీడియో నిజమైనదేనని.. మార్ఫింగ్‌, ఏఐ ద్వారా సృష్టించింది కాదని స్పష్టం  చేశారు. తన కాలికి ఫ్రాక్చర్ అయి సెలవులో ఉన్నప్పటికీ.. ఇంటి నుంచే వర్చువల్ విధానంలో సమావేశానికి హాజరైనట్లు ఆమె తెలిపారు. ఒక మహిళ గౌరవాన్ని కాపాడాలి. మాతో అలా ప్రవర్తించకూడదని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన కుమార్ రాజీవ్ రంజన్.. ఆవేశంలో ఏదైనా మాట్లాడి ఉంటే క్షమించాలన్నారు. తాను పలుమార్లు మౌనంగా ఉండాలని కోరినప్పటికీ.. మహిళా అధికారి తనను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆయన ఆరోపించారు.

అధికారులను ప్రశ్నించకపోతే సమీక్షా సమావేశాలు ఎలా నిర్వహించగలం? బాధ్యతలను ఎలా నిర్ధారించగలం? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై ఒక నిర్ణయానికి వచ్చే ముందుసుమారు గంటపాటు జరిగిన సమావేశానికి సంబంధించిన పూర్తి వీడియోను పరిశీలించాలని ఆయన కోరారు. వైరల్ అవుతున్న క్లిప్పుల్లో పూర్తి సందర్భం కనిపించడం లేదన్నారు.

ఇదీ చదవండి: ఆమెకు 30, అతనికి 75 : ఏడాది ప్రేమ, ఘనంగా ఎంగేజ్‌మెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement