అక్రమ అండాల కేసులో కీలక మలుపు | Police conducted searches at Oasis Hospital | Sakshi
Sakshi News home page

అక్రమ అండాల కేసులో కీలక మలుపు

Nov 28 2026 12:58 AM | Updated on Nov 28 2026 12:58 AM

Police conducted searches at Oasis Hospital

ఒయాసిస్‌ ఆసుపత్రిలో పోలీసుల సోదాలు

కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలు స్వాదీనం

సాక్షి, హైదరాబాద్‌: అండ సేకరణ పేరుతో డబ్బు ఆశ చూపి మహిళలను రప్పించి అక్రమాలకు పాల్పడుతు న్న రాకెట్‌పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశా రు. తాజాగా బేగంపేటలో ఉన్న ఒయాసిస్‌ ఆసుపత్రి కార్పొరేట్‌ కార్యాలయంలో విస్తృత సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలను స్వాధీ నం చేసుకున్నారు. కీలకంగా వ్యవహరిస్తున్న నిందితు డు దుర్గా ప్రసాద్‌ను ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అతడిని విచారిస్తున్న సమయంలో మరిన్ని కీలక ఆధారాలు లభించడంతో శుక్రవారం ఒయాసిస్‌ కార్పొరేట్‌ ఆఫీసులో సోదాలు నిర్వహించారు. ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్‌ పరికరాలు, ఏఆర్‌టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ సేవలు, దాతల రెఫరల్స్‌కు సంబంధించిన సంస్థాగత రికార్డులు, అండదానం కోసం మహిళల నియామకం, వారి నమోదు, స్క్రీనింగ్, రెఫరల్‌ వివరాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా డిజిటల్‌ పరికరాలు, పత్రాలను ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపించారు. 

ఆర్థిక లావాదేవీలు, చట్ట ఉల్లంఘనలపై దృష్టి 
ఈ వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, చట్టాల ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మధ్యవర్తులు, ఏఆర్‌టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ కేంద్రాలు ఇతర వ్యక్తుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు, డిజిటల్‌ రికార్డులు, కమ్యూనికేషన్‌ ఆధారాలతో.. దాతలకు అందిన నిధుల మూలాలు, డబ్బు మళ్లింపులు, మధ్యవర్తులకు చెల్లించిన మొత్తాలు, సంస్థల ప్రతినిధులు, మేనేజ్‌మెంట్, డైరెక్టర్లు, ఏజెంట్ల వివరాలు మొదలైన వాటిపై విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement