పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెనేటర్ ఫాతిమా పేమాన్ నవంబర్ 25న సెనేట్ ఛాంబర్‌లో జరిగిన ఒక చర్చలో తన కుమార్తె ఆలియాను ఎత్తుకుని కనిపించారు. ఆన్‌లైన్ హానికర సంఘటనలకు ప్రధాన టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లను మరింత జవాబుదారీగా చేయాలని కోరుతున్న ఫెడరల్ ప్రభుత్వం ఆన్‌లైన్ సేఫ్టీ సవరణ బిల్లు 2026పై చట్టసభ సభ్యులు చర్చిస్తున్నారు.
ఆమె తన పార్లమెంటరీ బాధ్యతల నుంచి వైదొలగకుండా తన బిడ్డను ఎత్తుకుని సభా కార్యకలాపాల్లో పాల్గొనడం కొనసాగించడం విశేషం. కార్యాలయాలు తల్లులకు సహాయక ఏర్పాట్లు చస్తే..వాళ్లు వృత్తిపరమైన బాధ్యతలను, పిల్లల సంరక్షణను ఎలా సమతుల్యం చేసుకోగలరో ఆ క్షణం స్పష్టం చేసింది.
ఎవరీ ఫాతిమా పేమాన్..?
ఫాతిమా పేమాన్ పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక స్వతంత్ర సెనేటర్. ఆమె 'ఆస్ట్రేలియాస్ వాయిస్' అనే రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. అఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న ఆమె చిన్నతనంలోనే తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వలస వచ్చారు.
ఆమె 2022లో లేబర్ పార్టీ సభ్యురాలిగా ఆస్ట్రేలియన్ సెనేట్‌లో ప్రవేశించి, ఆ సమయంలో దేశ పార్లమెంటుకు ఎన్నికైన అతి పిన్న వయస్కురాలైన ముస్లిం మహిళగా నిలిచారు. ఆ తర్వాత ఆమె లేబర్ పార్టీని విడిచిపెట్టి, తన సొంత రాజకీయ సంస్థను స్థాపించారు. ఈ ఏడాది ప్రారంభంలో, పదవిలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన మొదటి సెనేటర్‌గా పేమాన్ చరిత్ర సృష్టించారు.
శిశువులను అనుమతిస్తుందా?
ఆస్ట్రేలియా పార్లమెంటరీ నిబంధనల ప్రకారం, సెనేటర్లు, సభ్యులు తమ శిశువులకు ఆహారం ఇవ్వడానికి, సంరక్షణ కోసం వారిని సభలోకి తీసుకురావచ్చు. తల్లిదండ్రులకు పార్లమెంటును మరింత అనుకూలంగా మార్చడానికి 2016లో ఈ నిబంధనలను మార్చారు. కాగా, పేమాన్ తన కుమార్తెతో కలిసి కనిపించడం, పిల్లల సంరక్షణా సహాయం, కుటుంబానికి అనుకూలమైన కార్యాలయ విధానాల ప్రాముఖ్యతపై మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
Australian Senator Fatima Payman brought her infant daughter, Aaliyah, into the Senate chamber while participating in a debate on online safety legislation. Fellow Senator Lidia Thorpe was also seen sharing a playful moment with baby Aliyah. Payman made history earlier in 2026 as the first senator from Western Australia to give birth while serving in office. #australia #fatimapayman #worldnews #parliament
— APT News (@APT__News) November 25, 2026
ఇదీ చదవండి: 1400 ఏళ్లు జీవించగలరా మానవులు..?! ప్రొఫెసర్ నిక్ బోస్ట్రోమ్ షాకింగ్ వ్యాఖ్యలు


