మిస్ యూనివర్స్ పోటీల్లో ప్యూర్టో రికోకు చెందిన జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్, వెనిజులా పోటీదారులు వరుసగా మొదటి, రెండవ రన్నరప్‌లుగా నిలిచారు. అయితే భారత్‌కి ప్రాతినిధ్య వహించిన కజియా లిజ్ మెజ్ మాత్రం టాప్ 30 దాటి వెళ్లలేకపోయారామె. ఫైనల్‌లో స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత ఆమె నిష్క్రమించారు.
ఆమె కిరీటాన్ని కోల్పోయినప్పటికీ యావత్ దేశం ఆమె పట్ల గర్వంగా ఉంది అని భారతదేశపు తొలి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ప్రశంసించారు. ఈ మేరకు సుస్మిత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా పంచుకున్నారామె.
"ఆ అందమైన చిరునవ్వు ఎల్లప్పుడూ విశ్వానికి స్వాగతం పలకాలి. నువ్వు మమల్ని ఎంతో హుందాగా, ప్రేమగా సంతోషంగా ప్రతినిధించావు. నువ్వు అందరి హృదయాలను గెలుచుకున్నారు. నీ పట్ల గర్వపడుతున్నా". అంటూ పోస్ట్‌ని ముగించింది సుస్మితా సేన్. కాగా, ఆ టాప్ 30లోకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక టాప్ ప్రవేశించలేకపోయాయి.
ఇదీ చదవండి: మిస్ యూనివర్స్ పోటీల్లో గెలిచిన తొలి తల్లిగా జెన్నిఫర్ బారెట్..!


