బ్లింకిట్‌ యాప్ గుట్టు విప్పిన యువతి! | Woman Exposes Blinkit Hidden Secrets | Sakshi
Sakshi News home page

బ్లింకిట్‌ యాప్ గుట్టు విప్పిన యువతి!

Nov 28 2026 7:52 AM | Updated on Nov 28 2026 8:03 AM

Woman Exposes Blinkit Hidden Secrets

బ్లింకిట్‌ యాప్‌కు సంబంధించిన ఒక విషయం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అనికా బెరి అనే కంటెంట్ క్రియేటర్ బ్లింకిట్‌ యాప్‌ను రివర్స్ ఇంజనీరింగ్ చేసి, పరిశీలించినట్లు చెబుతూ.. ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

బ్లింకిట్ యాప్ మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్స్, వైఫై పేరు, లొకేషన్, బ్యాటరీ లెవెల్, ఫాంట్ సైజ్ వంటి వివరాలను పరిశీలిస్తోందని అనికా బెరి చెప్పారు. అంతేకాకుండా.. ఈ వివరాల ఆధారంగా వినియోగదారుల వయస్సు, వారి కొనుగోలు అలవాట్లను అంచనా వేసే అవకాశం ఉందని ఆరోపించారు.

అనికా చేసిన ఆరోపణల్లో ముఖ్యంగా ఫోన్‌లో ఉన్న ఇతర యాప్స్‌ను పరిశీలించడం, ఫాంట్ సైజ్, స్క్రీన్ జూమ్‌ను గమనించడం వంటివి ఉన్నాయి. ఒక వ్యక్తి పెద్ద అక్షరాలను ఉపయోగిస్తే అతను వయసులో పెద్దవాడై ఉండవచ్చని అంచనా వేయవచ్చని అనికా చెప్పారు. అంతే కాకుండా.. ఫోన్‌లోని బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు వినియోగదారుడు ఎక్కువగా ఆలోచించకుండా త్వరగా ఆర్డర్ చేసే అవకాశం ఉందని, ఇలాంటి వివరాలను కూడా యాప్ ఉపయోగించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ ఆరోపణలపై బ్లింకిట్ ఆండ్రాయిడ్ టీమ్ స్పందిస్తూ.. ఈ వివరాలను మార్కెటింగ్ కోసం కాకుండా, యాప్ పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: కొత్త బైకుతో సీఎం విజయ్.. కంపెనీ భారీ ప్లాన్!

అయితే.. ఈ సంఘటన ద్వారా మొబైల్ యాప్స్ ఎంతవరకు మన సమాచారాన్ని బయటపెడుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నిజానికి యాప్ పనితీరును మెరుగుపరచడానికి కొన్ని వివరాలు అవసరం కావచ్చు, కానీ.. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఎలా ఉపయోగిస్తారనే విషయంలో పారదర్శకత చాలా ముఖ్యం. కాబట్టి.. ఏ యాప్ ఉపయోగించినా దానికి ఇచ్చే అనుమతులు, ప్రైవసీ పాలసీ గురించి తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే టెక్నాలజీ ఎంత సౌకర్యాన్ని అందించినా, మన వ్యక్తిగత గోప్యత కూడా అంతే ముఖ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement