న్యూఢిల్లీ: ఇతర దేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు లోకల్ సిమ్ కార్డును కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా, డేటా ఈ–సిమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని సేవలను యథాతథంగా పొందే ఫీచరును త్వరలో ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఇందుకోసం జియో, స్మార్ట్ యాగ్జియాటా, స్మార్ట్ కమ్యూనికేషన్స్, వెరిజాన్ సహా పలు ఈ–సిమ్ ప్రొవైడర్లతో చర్చలు జరుపుతున్నట్లు వివరించింది. ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో దీన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది.
‘విదేశీ జర్నీల్లో కూడా యాప్‌ను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించేలా, కేవలం కొన్ని ట్యాప్‌లతోనే డేటా ఈ–సిమ్‌ను కొనుగోలు చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకునే ఫీచరును ప్రవేశపెట్టబోతున్నాం. తద్వారా విదేశాలక వెళ్లినప్పుడు అదే ఫోన్ నంబరుతో వాట్సాప్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చు. దీని వల్ల లోకల్ సిమ్ కార్డులను కొనుక్కునేందుకు ఎయిర్‌పోర్టుల్లో కియోస్‌్కల కోసం వెతుక్కోనక్కర్లేదు’ అని ఎక్స్ పోస్ట్‌లో వాట్సాప్ హెడ్ కునాల్ షా తెలిపారు.


