టెక్‌ కంపెనీలకు ట్రంప్‌ వార్నింగ్‌! | Trump issues stern warning to US tech giants | Sakshi
Sakshi News home page

టెక్‌ కంపెనీలకు ట్రంప్‌ వార్నింగ్‌!

Nov 21 2026 6:49 AM | Updated on Nov 21 2026 6:58 AM

Trump issues stern warning to US tech giants

వాషింగ్టన్‌: అమెరికా టెక్‌ దిగ్గజాలకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కంపెనీలు ఇతర దేశాల్లో డేటా సెంటర్లు నిర్మించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అలా నిర్మించే సంస్థలపై భారీ పన్నులు, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అమెరికాలో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి అనుమతులు నిలిపివేస్తే ఈ పరిశ్రమ మొత్తం చైనా చేతుల్లోకి వెళ్లిపోతుందని వ్యాఖ్యానించారు.

స్వదేశంలో డేటా సెంటర్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా గతంలో వ్యవహరించడం అమెరికా చేసిన పొరపాటుగా అభివర్ణించారు. చైనాలోని షెన్‌జెన్‌ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఏపీఈసీ సదస్సు సందర్భంగా త్రైపాక్షిక భేటీలో ట్రంప్‌ పాల్గొన్నారు.

మరోవైపు అమెరికాలో డేటా సెంటర్ల నిర్మాణంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ప్యూ పరిశోధనా సంస్థ సర్వే ప్రకారం.. 54 శాతం మంది అమెరికన్లు డేటా సెంటర్లు పర్యావరణానికి హానికరమని అభిప్రాయపడ్డారు. 50 శాతం మంది వీటివల్ల విద్యుత్‌ ఖర్చులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గాలప్‌ సర్వేలో 71 శాతం మంది తమ ప్రాంతాల్లో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణాన్ని వ్యతిరేకించారు. విద్యుత్‌ ధరలు, నీటి వినియోగం, స్థానిక వనరులపై ఒత్తిడి ప్రధాన ఆందోళనలుగా నిలిచాయి.

ఇదీ చదవండి: ఉద్రిక్త దేశాల సుందరీమణుల స్నేహబంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement